ETV Bharat / entertainment

పిల్లలతో మహేశ్​.. ఫొటో షేర్​ చేసిన నమ్రత.. 'గౌతమ్​కు అన్నయ్య ఉన్నాడా అంటూ..' - నమ్రత శిరోద్కర్​ ఇన్​స్టా పోస్ట్

ప్రముఖ నటి, మహేశ్​ బాబు భార్య నమత్ర శిరోద్కర్​ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ క్యూట్​ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది. దీంతో నమ్రతకు గౌతమ్​ కాకుండా మరో అబ్బాయి ఉన్నాడా అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

mahesh babu with kids
mahesh babu with kids
author img

By

Published : Apr 11, 2023, 8:34 PM IST

ఓ పక్క ఫ్యామిలీ లైఫ్​లో బిజీగా ఉంటూనే మరోవైపు తమ ఇంటి బిజినెస్​ వ్యవహారాలను చక్కదిద్దుతుంటారు సినీ నటి నమ్రత శిరోద్కర్​. ఇక ఆమె బిజీ లైఫ్​లో అప్పుడప్పుడు సోషల్​ మీడియాలో తనతో పాటు మహేశ్​ అభిమానుల కోసం ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తుంటుంటారు. ఈ క్రమంలో మహేశ్​ బాబు భార్య నమత్ర శిరోద్కర్​ ఇన్​స్టా వేదికగా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ క్యూట్​ ఫొటోను షేర్ చేశారు. అందులో మహేశ్​ తన పిల్లలైన సితార, గౌతమ్‌లతో ఇంటరాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆ పోస్ట్​ కింద "ఒకే చోట కలసిన నా ముగ్గురు యోధులు" అనే క్యాఫ్షన్​ను జోడించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్​ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఆ ఫొటోలో మహేశ్​ లుక్స్​ గురించి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. కొత్త లుక్​ సూపర్​ అంటూ ఆ ఫొటోను తెగ షేర్​ చేస్తున్నారు. మరోవైపు ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. "నమ్రత.. మీకు గౌతమ్​ కాకుండా మరో పెద్ద అబ్బాయి కూడా ఉన్నారని చెప్పలేదేంటండి. గౌతమ్​కు అన్నయ్య ఉన్నాడా ..? అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

mahesh babu with kids
పిల్లలతో మహేశ్

ఇటీవలే మహేశ్​కు సంబంధించిన ఓ క్రేజీ ఫొటోను సైతం నమ్రత షేర్​ చేశారు. అందులో మహేశ్​ బాబు ఓ బ్లూ కలర్​ సూట్​ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఆ ఫొటో.. ఓ ప్రముఖ దస్తుల బ్రాండ్​ కోసం తీసిన ఫొటో షూట్​కు సంబంధించిందని సమాచారం.

ఇక మహేశ్ బాబు రాబోయే సినిమాల​ విషయానికి వస్తే.. మహేశ్​ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. 'SSMB28' అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కనున్న ఈ సినిమాతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ కాంబో మళ్లి తెరపైకి వచ్చింది. ఇక సినిమాలో మహేశ్​ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. అంతే కాకుండా శ్రీలీల కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజవ్వనుంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్​ లుక్​లో మహేశ్​ న్యూ లుక్​కు ఫిదా అయిన ఫ్యాన్స్​.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజౌతుందా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్​.. త్వరలో దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.