Naa Saami Ranga Movie Review : కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా అచ్చొచ్చిన సీజన్ అన్న సంగతి తెలిసిందే. 'బంగార్రాజు', 'సోగ్గాడే చిన్ని నాయన' వంటి హిట్ చిత్రాలన్నీ పండగ బరిలోనే వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సారి ముగ్గుల పండగకు 'నా సామిరంగ'తో వచ్చారు నాగ్. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ ఫేమ్ ఎం.ఎం.కీరవాణి సంగీతమందించారు. మరి ఇంతకీ ఈ 'నా సామిరంగ'కథేంటి? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చింది?
Naa Saami Ranga Review Story కథేంటంటే : కిష్టయ్య (నాగార్జున) ఓ అనాథ. అంజి (అల్లరి నరేశ్) తల్లి అతడిని పెంచుతుంది. దీంతో కిష్టయ్య - అంజి సొంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అయితే తల్లి చనిపోయిన తర్వాత వారిద్దరికీ ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య (నాజర్) అండగా ఉంటాడు. అందుకే కిష్టయ్య పెద్దయ్య మాట దాటి ఏమీ చేయడు. అయితే కిష్టయ్య 12ఏళ్ల వయసులోనే వరాలుతో(ఆషికా రంగనాథ్) ప్రేమ కథ నడిపిస్తాడు. కానీ చిన్నతనంలోనే చదువుల కోసం సిటీకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మళ్లీ 15 ఏళ్లకు తిరిగి వస్తుంది. దీంతో ఇద్దరి మళ్లీ ప్రేమ మొదలవుతుంది.
అయితే ఓ వైపు తన ప్రేమ గురించి పెద్దయ్యకు చెప్పేందుకు వరాలును తీసుకొని ఇంటికి వెళ్తాడు కిష్టయ్య. సరిగ్గా అదే సమయంలో వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేశ్) తన కూతుర్ని పెద్దయ్య కుమారుడు దాసు (షబ్బీర్)కు ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకుంటాడు. కానీ కిష్టయ్య - వరాలు ప్రేమను అర్థం చేసుకున్న పెద్దయ్య వరదరాజులతో సంబంధాన్ని వదులుకుంటాడు. కానీ, తన కూతుర్ని కిష్టయ్యకు ఇచ్చి పెళ్లి చేయడానికి వరదరాజులు అంగీకరించడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందా? ఆ తర్వాత దాసు ఏం చేశాడు? అతడు అసలు అంజిపైనా పగ పెంచుకోవడానికి కారణమేంటి? కిష్టయ్య - అంజిని చంపేందుకు వేసిన ప్లాన్ పని చేసిందా? ఈ స్టోరీలో భాస్కర్ (రాజ్‌తరుణ్) - కుమారి (రుక్సార్)ల లవస్టోరీతో ఏర్పడ్డ సంఘర్షణ ఏంటి? వీరిద్దరిని కలపాలని కిష్టయ్య - అంజి చేసిన ప్రయత్నాలు ఫలించాయా? అనేదే కథ.
ఎలా సాగిందంటే : మలయాళ చిత్రానికి రీమేక్ ఇది. కానీ అలా ఉండదు. నెటివిటీకి తగ్గట్టు మార్చడంలో రచయిత ప్రసన్న కుమార్ సక్సెస్ అయ్యాడు. ఫ్రెండ్షిప్, లవ్, రివెంజ్, విధేయత వంటి ఎలిమెంట్స్ కథలో ఉన్నాయి. ఈ టైప్ సినిమాలు తెలుగులో చాలానే వచ్చినా దీనికి 1980ల నాటి కోనసీమ బ్యాక్‌డ్రాప్ సెట్ చేయడం వల్ల కొత్తదనం కనిపించింది. ప్రేక్షకులకు ఆకట్టుకుంది. మాస్ యాక్షన్ అంశాలు ఆకట్టుకున్నాయి. అంజి, వరాలు పాత్రల్ని తీర్చిదిద్దిన తీరు బాగుంది.
-
#NaaSaamiranga mental mass 🔥🔥🔥
— Mr.Lonely 📛 (@d88137) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Interval action sequences and cycle chain reference 🤙🏻🤙🏻
K ramp 🔥🔥🔥🤙🏻#NaaSaamiRangaOnJan14th
">#NaaSaamiranga mental mass 🔥🔥🔥
— Mr.Lonely 📛 (@d88137) January 14, 2024
Interval action sequences and cycle chain reference 🤙🏻🤙🏻
K ramp 🔥🔥🔥🤙🏻#NaaSaamiRangaOnJan14th#NaaSaamiranga mental mass 🔥🔥🔥
— Mr.Lonely 📛 (@d88137) January 14, 2024
Interval action sequences and cycle chain reference 🤙🏻🤙🏻
K ramp 🔥🔥🔥🤙🏻#NaaSaamiRangaOnJan14th
ఫస్ట్ ఆఫ్‌లో కిష్టయ్య - అంజి చిన్ననాటి ఎపిసోడ్‌తో సినిమా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. భాస్కర్‌ను కాపాడే క్రమంలో వచ్చే ఓ సూపర్ యాక్షన్ ఎపిసోడ్‌తో నాగార్జున ఇంట్రడక్షన్ ఆకట్టుకుంటుంది. కిష్టయ్య - వరాలుల లవ్‌స్టోరీని భాస్కర్‌కు అంజి చెప్పడంతో సినిమా రొమాంటిక్ టచ్‌తో మళ్లీ ఫ్లాష్‌బ్యాక్ టర్న్ తీసుకుంటుంది. వీళ్ల లవ్‌స్టోరీలో కొత్తదనం లేకున్నా దాన్ని తెరపై చూపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. దాసు పాత్ర కథలోకి ఎంటర్ అయినప్పటి నుంచే సినిమాలో సంఘర్షణ మొదలవుతుంది. ఓ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌తో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది.
సెకండాఫ్ కిష్టయ్య - అంజిల హత్యకు దాసు ప్లాన్ చేయడంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి సినిమా పూర్తిగా యాక్షన్ మోడ్‌లో సాగుతుంది. కానీ, ఆ ఎపిసోడ్ కేవలం కిష్టయ్య పాత్రకు ఎలివేషన్‌లా చూపిస్తారు. దీంతో సినిమా కాస్త నెమ్మదిస్తుంది. వరాలు - కిష్టయ్యల లవ్‌ట్రాక్ మళ్లీ మొదలయ్యాక కథ మరీ స్లోగా నడుస్తుంది. అనంతరం అంజిపై దాసు దాడి చేసే ఎపిసోడ్‌తో కథ మళ్లీ స్పీడ్ మోడ్‌లోకి వెళ్తుంది. ఆ తర్వాత సినిమా ఒక్కసారిగా ఎమోషనల్‌గా మారుతుంది. ఇక క్లైమాక్స్‌లో నాగ్ యాక్షన్ హంగామా సూపర్‌గా ఉంటుంది. సినిమాను ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది.
-
K-I-N-G size title card 🥵🤌👑🔥 #NaaSaamiRanga pic.twitter.com/qahV5bIkKe
— Tom Bhayya 🇮🇳 (@Tom_Bhayya_Here) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">K-I-N-G size title card 🥵🤌👑🔥 #NaaSaamiRanga pic.twitter.com/qahV5bIkKe
— Tom Bhayya 🇮🇳 (@Tom_Bhayya_Here) January 14, 2024K-I-N-G size title card 🥵🤌👑🔥 #NaaSaamiRanga pic.twitter.com/qahV5bIkKe
— Tom Bhayya 🇮🇳 (@Tom_Bhayya_Here) January 14, 2024
-
Done with first halfff
— 👑NAG (@priyathamKING) January 14, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Intro fight 💥💥
Love story scenes 😍😍👌🏻
Raj tharun and Naresh scenes
And Interval bang ki papers ekkuva pettukondammaaaaa K RAMP. @iamnagarjuna 🔥🔥💥💥💥💥🙏🏻🙏🏻#NaaSaamiranga 💪🏻💪🏻 https://t.co/2JkPS3DHg8 pic.twitter.com/ffRRJXquK3
">Done with first halfff
— 👑NAG (@priyathamKING) January 14, 2024
Intro fight 💥💥
Love story scenes 😍😍👌🏻
Raj tharun and Naresh scenes
And Interval bang ki papers ekkuva pettukondammaaaaa K RAMP. @iamnagarjuna 🔥🔥💥💥💥💥🙏🏻🙏🏻#NaaSaamiranga 💪🏻💪🏻 https://t.co/2JkPS3DHg8 pic.twitter.com/ffRRJXquK3Done with first halfff
— 👑NAG (@priyathamKING) January 14, 2024
Intro fight 💥💥
Love story scenes 😍😍👌🏻
Raj tharun and Naresh scenes
And Interval bang ki papers ekkuva pettukondammaaaaa K RAMP. @iamnagarjuna 🔥🔥💥💥💥💥🙏🏻🙏🏻#NaaSaamiranga 💪🏻💪🏻 https://t.co/2JkPS3DHg8 pic.twitter.com/ffRRJXquK3
ఫైనల్‌గా నాగార్జున, నరేశ్‌ల నటన, యాక్షన్ ఎపిసోడ్స్, పాటలు సినిమాకు బలం. కొత్తదనం లేని కథ, నెమ్మదిగా సాగే కథనం బలహీనతలు. ఫైనల్‌గా ఈ పండక్కి మాస్ ప్రేక్షకులకు నా సామిరంగ.