ETV Bharat / entertainment

నాగార్జున కొత్త సినిమా అప్డేట్​.. షూటింగ్​ షురూ అప్పుడే! - Nagarjuna Malayalam Movie

'ది ఘోస్ట్​' సినిమా తర్వాత హీరో నాగార్జున రచయిత ప్రసన్న కుమార్‌ బెజవాడతో కలిసి ఓ కొత్త సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు..

Nagarjuna Malayalam Movie
నాగార్జున మలయాళ సినిమా
author img

By

Published : Feb 21, 2023, 9:43 PM IST

Updated : Feb 21, 2023, 10:59 PM IST

ఇండస్ట్రీలోని ప్రముఖ అగ్రహీరోల్లో నాగార్జున ఒకరు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా 'ది ఘోస్ట్‌' మూవీతో తెలుగు ఆడియెన్స్​ను పలకరించిన నాగ్ అనుకున్న రేంజ్​లో మాత్రం​ మెప్పించలేకపోయారు. అయితే ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్​ తీసుకొని మరో కొత్త ప్రాజెక్టు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అది కూడా 2019లో కోలీవుడ్​లో విడుదలై బ్లాక్​బస్టర్ అందుకున్న ఓ మలయాళ చిత్రాన్ని రీమేక్​ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.

రచయిత ప్రసన్న కుమార్‌ బెజవాడతో కలిసి ఈ కొత్త సినిమా చేయబోతున్నారని వినిపిస్తోంది. అయితే దాదాపుగా ఖరారైన ఈ సినిమా గురించి మరో ఆసక్తిక విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన రెగ్యులర్​ షూటింగ్​ వచ్చే నెల ప్రారంభం కానుందని ​ తెలిసింది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్​ చిత్రీకరణను మైసూరులో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముంది.

'పొరింజు మ‌రియం జోస్‌‌' తెలుగులో.. కోలీవుడ్​ బాక్సాఫీస్​ ముందు భారీ కలెక్షన్లు వసూలు చేసిన 'పొరింజు మ‌రియం జోస్‌‌' అనే మూవీ రీమేక్‌లోనే నాగార్జున నటించనున్నారట. 2019లో విడుదలైన ఈ మలయాళ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీన్ని డైరెక్టర్​ జోషీ తెరకెక్కించారు. రెజీ మోన్​ నిర్మించారు. అయితే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తీర్చిదిద్ది విడుదల చేయాలని నాగార్జున దర్శక నిర్మాతలకు సూచించారట.

అలా కొత్త దర్శకులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మన్మథుడు ఈ రీమేక్‌తో ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్​ డైరెక్టర్‌ను పరిచయం చేస్తున్నారు. 'నేను లోకల్‌', 'ధమాకా' చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడకు ఈ రీమేక్​తో డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారట. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఈ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Last Updated : Feb 21, 2023, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.