ETV Bharat / entertainment

సామ్​తో మళ్లీ అలా చేస్తానో లేదో మీకే తెలియాలి: నాగచైతన్య - నాగచైతన్యపై సమంత కామెంట్స్​

Nagachaitanya Samantha: ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య, హీరోయిన్​ సమంతపై ఇంట్రెస్టింగ్​ కామెంట్స్ చేశారు యువ హీరో నాగచైతన్య. ప్రస్తుతం ఈ కామెంట్స్​ హాట్​టాపిక్​గా మారాయి. ఏంటంటే?

nagachaitanya samantha
నాగచైతన్య సమంత
author img

By

Published : Aug 1, 2022, 10:59 AM IST

Updated : Aug 1, 2022, 11:58 AM IST

Nagachaitanya Samantha: సమంతతో కలిసి మళ్లీ నటించాలా వద్దా అనేది ప్రపంచానికే తెలియాలని అన్నారు హీరో నాగచైతన్య. అలానే విడాకుల తర్వాత సామ్​, తాను ఎవరి దారిలో వారు సాగిపోతున్నారని చెప్పారు. "కెరీర్‌లో నేను సాధించిన విజయాలకంటే నా వ్యక్తిగత జీవితం ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలవడం చూస్తుంటే చిరాకుగా ఉంది. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయాలను ఏదో ఒక ప్రకటన రూపంలో తెలియజేస్తుంటా. మంచైనా, చెడైనా నా జీవితం గురించి అందరితో పంచుకోవాల్సిన విషయాలన్నింటినీ చెప్పాల్సినంత వరకూ చెబుతా. విడిపోయినప్పుడు కూడా సమంత, నేనూ ఏమైతే చెప్పాలనుకున్నామో అదే విషయాన్ని మేమిద్దరం ప్రకటనల రూపంలో బయటపెట్టాం. విడిపోయి ఎవరి జీవితాల్లో వారు ముందుకు సాగిపోవాలనుకుంటున్నామనే చెప్పాం. అంతకు మించి మా మధ్య జరిగిన ఒక్క విషయాన్ని నేను ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకోవడం లేదు. నా జీవితంలో అసలు ఏం జరిగిందో నా కుటుంబం, బంధుమిత్రులందరికీ తెలుసు. ఇక న్యూస్‌ని న్యూసే రీప్లేస్‌ చేస్తుంది. సోషల్‌మీడియాలో నా గురించి జరుగుతోన్న ప్రచారాలు, ఉహాగానాలన్నీ తాత్కాలికమైనవి. దీనిపై నేనెంత స్పందిస్తే అన్ని వార్తలు పుట్టుకొస్తాయి. అది నాకిష్టం లేదు. అందుకే నేను వాటిని పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. ఏదో ఒకరోజు ఈ ప్రచారాలన్నింటికీ ముగింపు ఉంటుందనే నమ్మకం నాకు ఉంది" అని చైతూ అన్నారు.

సమంతతో మళ్లీ కలిసి నటిస్తారా? అని అడగ్గా.. అదే జరిగితే చాలా క్రేజీగా ఉంటుంది. కానీ అది జరుగుతుందా? లేదా? అనేది నాకు తెలియదు. ఈ ప్రపంచానికే తెలియాలి. భవిష్యత్​లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. కాగా, ఇటీవలే 'కాఫీ విత్​ కరణ్​ షో'లో అక్షయ్​కుమార్​తో కలిసి పాల్గొన్న సమంత.. చైతూపై షాకింగ్ కామెంట్స్​ చేశారు. చైతూ విడిపోవడానికి గల కారణాలను, విడాకుల తర్వాత తను ఎదుర్కొన్న పరిస్థితులను గురించి వివరించారు. ఈ నేపథ్యంలో కరణ్ షోకు మీరు వెళ్తారా అని అడగ్గా.. "కాఫీ విత్ కరణ్ షోలోనా? నాకు ఛాన్స్ వస్తే ఎందుకు వెళ్లను. కరణ్ జోహార్ చాలా గొప్ప వ్యక్తి. అతడు చేసే పని నాకు నచ్చుతుంది. అతడు నన్ను కావాలనుకుంటే ఎందుకు వెళ్లను తప్పకుండా" వెళ్తా అని చైతన్య తెలిపారు.

ఇదీ చూడండి: స్టార్​హీరోకు బెదిరింపులు.. గన్​లైసెన్స్​ మంజూరు చేసిన పోలీసులు

Last Updated : Aug 1, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.