ETV Bharat / entertainment

జులై 8న ‘థ్యాంక్‌ యూ’ రిలీజ్​- విలన్​గా 'రాజారాణి' నటుడు - నాగచైతన్య న్యూస్​

నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న 'థ్యాంక్‌ యూ' సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను జులై 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

naga-chaitany
థ్యాంక్‌ యూ
author img

By

Published : May 14, 2022, 3:27 PM IST

Updated : May 14, 2022, 11:16 PM IST

అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్‌ యూ'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విభిన్న ప్రేమకథగా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జులై 8న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ట్విట్టర్‌ వేదికగా 'జులై 8న థియేటర్లలో సందడి చేయనున్నాం. అంతా సిద్ధంగా ఉండండంటూ' ట్విట్‌ చేసింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్‌,మాళవిక నాయర్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు.

'పట్టాం పూచ్చి'లో జయ్​..

దర్శకుడు సుందర్‌ సి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'పట్టాం పూచ్చి'. ఇందులో ప్రతి నాయకుడిగా జయ్‌ నటించడం విశేషం. ఈ క్రేజీ చిత్రాన్ని అవ్నీ టెలీ మీడియా పతాకంపై నటి కుష్భు సుందర్‌ నిర్మిస్తున్నారు. నటి హనీరోస్, ఇమాన్‌ అన్నాచ్చి, బేబీ మనస్వి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బద్రి కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి: 'కేజీఎఫ్​ 3' షురూ అయ్యేది​ అప్పుడే.. సరికొత్త లుక్​లో సల్మాన్​ భాయ్​

Last Updated : May 14, 2022, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.