కొత్తదనం కూడిన భిన్న కథలతో ప్రస్తుతం కెరీర్లో ముందుకెళ్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. హ్యాపీ డేస్ సినిమాతో గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత పలు చిత్రాలు చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ స్వామి రారా, కార్తికేయ, అర్జున్ సురవరం చిత్రాలు అతని కెరీర్‌ను టర్న్ చేశాయి. ఇక కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. కృష్ణతత్వంతో తెరకెక్కిన ఈ సినిమా అటు సౌత్ ఇటు నార్త్ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అయింది. బాక్సాఫీస్ మందు బిగ్ సక్సెస్‌ను అందుకుంది. ఆయన కెరీర్లోనే రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. రీసెంట్గా వచ్చి 18పేజీస్ కూడా మంచి టాక్‌నే తెచ్చుకుంది. ఫీల్ గుడ్ మూవీగా యూత్ హృదయాలను తాకింది. ఆయన బిజినెస్ మార్కెట్ కూడా బాగానే పెరిగింది.
ఈ క్రమంలోనే ఆయనతో పనిచేసేందుకు దర్శకనిర్మాతలు, భారీ నిర్మాణ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. మంచి ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారని సమాచారం. అలానే నిఖిల్ కూడా తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారట. నిఖిల్ మార్కెట్ కూడా పెరగడంతో ఆయన అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారట. దీంతో తన తొలి సినిమాకు రూ.25 వేల పారితోషికంతో కెరీర్ మొదలు పెట్టిన నిఖిల్ ఇప్పుడు.. తన ఒక్కో సినిమాలకు రూ.12-14కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నిఖిల్‌తో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార, మైత్రీ మూవీ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. చర్చలు జరుగుతున్నాయట. త్వరోలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఇకపోతే నిఖిల్ త్వరలోనే స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్ కథానాయిక.
ఇదీ చూడండి: ఎన్టీఆర్ - త్రివిక్రమ్.. ఊహించని రేంజ్లో కొత్త ప్రాజెక్ట్