Adipurush 3D Movie : ఎక్కడ చూసినా ఇప్పుడు 'ఆదిపురుష్' గురించే ప్రస్తావన. మరో మూడు రోజుల్లో సందడి చేయనున్న ఈ సినిమాను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కాంట్రవర్సీలతో మొదలై ఇప్పుడు భారీ స్థాయిలో పాజిటివిటీని అందుకుంది. టీజర్ తర్వాత రిలీజైన ట్రైలర్స్, 'జై శ్రీ రామ్', 'రామ్ సీతా రామ్' లాంటి సాంగ్స్ సినిమా రేంజ్‌ను పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు రెండు మూడు రోజుల నుంచి సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
త్రీడీలో హైలైట్స్ ఇవే..
Adipurush 3D Shows : ఈ మూవీ 2డీతో పాటు త్రీడీలోనూ రిలీజ్ కానుంది. అయితే టీజర్, ట్రైలర్ చూసిన అభిమానులకు సినిమా ఎలా ఉండనుందో ఓ అంచనాకు వచ్చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్‌లో రాముడు-సీత మధ్య ఉన్న భావోద్వేగ ప్రేమ సన్నివేశాలు, సీత అపహరణ, లంకా దహనం, రావణ సంహారం లాంటి ఎపిసోడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ వెబ్సైట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన రివ్యూలో.. సినిమాలో ఏఏ సన్నివేశాలు హైలైట్‌గా ఉండనున్నాయి, ముఖ్యంగా 3డీలో ఆకట్టుకునే సన్నివేశాలు ఏంటనేది తెలిపింది. వాలి-సుగ్రీవుల ఘర్షణ, శూర్పణఖ సీన్స్, రాఘవ-ఖర పోరాట సన్నివేశం, హనుమంతుడు లంకను దహించే సన్నివేశం, అలాగే సేతు నిర్మాణంతో పాటు రామ-రావణ యుద్ధం.. ఇలాంటి సన్నివేశాలు త్రీడీలో వీక్షిస్తే ఆ ఫీల్ అదిరిపోయిందంటూ ఆ సంస్థ వెల్లడించింది. ఇది పక్కా 3 డీ సినిమా మెటేరియల్ అని రాసుకొచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాను త్రీడీలోనే చూసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.
నెగటివ్‌గా ఉమైర్ సంధు.. అంతకుముందు బాలీవుడ్ సినీ విశ్లేషకుడు ఉమైర్ సైంధు 'ఆదిపురుష్' ఫస్ట్ రివ్యూను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. సినిమా ఏ మాత్రం బాలేదంటూ ట్విట్టర్ వేదికగా వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. వాస్తవానికి అతడు ప్రతి సినిమాకు ఇచ్చిన రివ్యూకు భిన్నంగా మూవీ టాక్ వస్తుంటుంది. దీంతో సినీ ప్రియులు.. ఫేక్ రివ్యూస్ ఇవొద్దంటూ అతడిని హెచ్చరిస్తున్నారు.
-
First Review #Adipurush = 500 cr in the Dustbin 🤮. 3 Hours Torture with Fake VFX & Bad Performances by all Actors. Shame on Makers for ruining religious film.
— Umair Sandhu (@UmairSandu) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
⭐️⭐️ pic.twitter.com/FstwbV8nit
">First Review #Adipurush = 500 cr in the Dustbin 🤮. 3 Hours Torture with Fake VFX & Bad Performances by all Actors. Shame on Makers for ruining religious film.
— Umair Sandhu (@UmairSandu) June 12, 2023
⭐️⭐️ pic.twitter.com/FstwbV8nitFirst Review #Adipurush = 500 cr in the Dustbin 🤮. 3 Hours Torture with Fake VFX & Bad Performances by all Actors. Shame on Makers for ruining religious film.
— Umair Sandhu (@UmairSandu) June 12, 2023
⭐️⭐️ pic.twitter.com/FstwbV8nit
జోరందుకున్న బుక్కింగ్స్..
Adipurush Advance Bookings : జూన్ 16న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఓవర్సీస్తో పాటు దేశవ్యాప్తంగా బుకింగ్స్ జోరుగా అవుతున్నాయి. ఇప్పటకే పలు ప్రాంతాల్లో టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నాయట. కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఇక ఈ సినిమాకు క్రేజ్ రెట్టింవుతున్న నేపథ్యంలో పలువురు సినీ తారలు ముందుకొచ్చి భారీ స్థాయిలో టిక్కెట్లు కొనుగోలు చేసి పంచుతున్నారు. స్టార్ డైరెక్టర్ అభిషేక్ అగర్వాల్ 10 వేలు, హీరో రణ్‌బీర్ కపూర్ 10 వేలు, రామ్‌చరణ్ 10వేలు, మంచు మనోజ్ 2500 టికెట్లు కొనుగోలు చేసి పేదలకు, అనాథాశ్రమాలకు పంచుతున్నారు. దీంతో సినీ ప్రియులకు.. ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">