ETV Bharat / entertainment

సల్మాన్​ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.. భద్రత కట్టుదిట్టం - salman khan threatening mumbai letter

Salman Khan: హత్యా బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్​ ఖాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబయి పోలీసులు. ఈ మేరకు సోమవారం అతడి ఇంటి వద్దకు చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

Mumbai Police
Salman Khan
author img

By

Published : Jun 6, 2022, 3:38 PM IST

Salman Khan: బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబయి పోలీసులు. సల్మాన్​ సహా అతడి తండ్రి సలీమ్​ ఖాన్​ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం సల్మాన్​ ఇంటి వద్దకు చేరుకున్న సీనియర్ అధికారులు.. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.

ఇదీ జరిగింది: ఆదివారం ఉదయం సల్మాన్​ తండ్రి సలీమ్​ ఖాన్​.. స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాకింగ్​కు వెళ్లారు. అక్కడే ఓ బెంచీ మీద విశ్రాంతి తీసుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన పక్కన ఓ లేఖ వదిలి వెళ్లారు. దివంగత పంజాబ్​ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే తండ్రీకొడుకులకు కూడా పడుతుందని.. ఇద్దరినీ హత్య చేస్తామని దుండగులు లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆదివారమే ముంబయికి సల్మాన్​: ఐఫా ఉత్సవాల కోసం అబుదాబి వెళ్లిన సల్మాన్​.. ఆదివారమే తిరిగి ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం మనీశ్​ శర్మ దర్శకత్వంలో 'టైగర్​ 3'లో నటిస్తున్నారు సల్మాన్. కత్రినా కైఫ్​ హీరోయిన్. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2023 ఏప్రిల్ 21న విడుదలకానుంది.

ఇదీ చూడండి: బాలీవుడ్​ నటుడు సల్మాన్​ఖాన్​కు బెదిరింపులు.. చంపేస్తామని లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.