ETV Bharat / entertainment

మల్టీప్లెక్స్‌లో రూ.75కే సినిమా.. ఆఫర్​లో చిన్న ఛేంజ్.. ఈ డేట్​ గుర్తుపెట్టుకోండి!

author img

By

Published : Sep 13, 2022, 7:15 PM IST

National Cinema Day : మల్టీప్లెక్స్ థియేటర్లలో అతి తక్కువ ఖర్చుతో సినిమా చూడాలని ఉందా? అయితే ఈ డేట్​ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎందుకంటే మల్టీప్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా బంపర్​ ఆఫర్ ప్రకటించింది. అది కూడా ఒక్కరోజే వర్తిస్తుంది.

Multiplex Association of India
Multiplex Association of India postpones National Cinema Day to Sept 23

National Cinema Day : మల్టీప్లెక్స్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎంఏఐ) సినీ అభిమానులకు శుభవార్త చెప్పింది. పీవీఆర్‌, ఐనాక్స్‌, కార్నివాల్‌, మిరాజ్‌, సిటీప్రైడ్‌, ఏషియన్‌, మూవీ టైమ్‌, వేవ్‌ సహా 4000లకుపైగా థియేటర్లలో రూ. 'నేషనల్‌ సినిమా డే'గా సందర్భంగా రూ.75కే సినిమాలను ప్రదర్శించనున్నట్టు తెలిపింది. అయితే మొదటగా సెప్టెంబరు 16న 'నేషనల్‌ సినిమా డే'గా జరపాలని ఎంఏఐ ప్రకటించింది. తాజాగా ఈ తేదీని సెప్టెంబర్​ 23న జరిపాలని నిర్ణయించింది. ఇందులో ఉన్న స్టేక్​ హోల్డర్ల విజ్ఞప్తి మేరకు, ఎక్కువ మల్టీప్లెక్స్​లను భాగం చేయడానికి తేదీని వాయిదా వేశామని ఎంఏఐ పేర్కొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయా మల్టీప్లెక్స్‌ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది.

ఆయా థియేటర్లలో నేరుగా టికెట్‌ తీసుకుంటేనే రూ. 75కు లభించనుంది. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేయాల్సివస్తే టికెట్‌ ధరకు అదనంగా ఇంటర్నెట్‌ ఛార్జీ, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. యూఎస్‌, యూకేల్లో సెప్టెంబరు 3న సినిమా డే సెలబ్రేషన్స్‌ జరిగాయి. సెప్టెంబరు 23న విడుదలయ్యే సినిమాలకే కాకుండా అప్పటికే ప్రదర్శితమవుతున్న చిత్రాలకూ ఈ అవకాశం ఉంటుంది. ఒక్కరోజుకే పరిమితం చేయకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్‌ ఇస్తే ఎక్కువ మంది మల్టీప్లెక్స్‌ అనుభూతిని పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత సినిమాల ఊపు కొనసాగింది. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి.

ఇవీ చదవండి: పాక్​బౌలర్​తో రిలేషన్​.. పంత్​కు క్షమాపణ చెప్పిన ఊర్వశి రౌతేలా

ఆ పది నగరాల్లో నాగశౌర్య పాదయాత్ర.. ఫలితం దక్కుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.