Mrunal Thakur in Lust Stories Sequel: 2018లో నాలుగు కథలతో ఆంథాలజీ సినిమాగా తెరకెక్కిన 'లస్ట్ స్టోరీస్' విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. మోడ్రన్ రిలేషన్‌షిప్స్ బ్యాక్‌డ్రాప్‌లో బోల్డ్ కథాంశంతో లస్ట్ స్టోరీస్‌ను దర్శకులు అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ, కరణ్ జోహార్, జోయా అక్తర్ తెరకెక్కించారు. వైవాహిక బంధంలో మహిళల్లో నెలకొన్న అసంతృప్తి, భయాలను బోల్డ్ పంథాలో తెరకెక్కించిన తీరు అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే అందులోని చాలా సీన్స్‌పై కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సీక్వెల్‌లో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్‌తో పాటు తమన్నా, కాజోల్, నీనా గుప్తా, అమృతా సుభాష్, విజయ్ వర్మ, తిలోత్తమా షోమ్, అంగద్ బేడీ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం లస్ట్ స్టోరీస్ సీజన్ -2కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ ఆంథాలజీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. లస్ట్ స్టోరీస్ సీక్వెల్ కూడా నేరుగా ఓటీటీలోనే రీలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం.