ETV Bharat / entertainment

ఓటీటీలో 'విక్రమ్'​ సందడి.. థియేటర్​లో లావణ్య 'హ్యాపీ బర్త్‌డే' - kondaveedu

వెండితెరపై సంచలన విజయంగా నిలిచిన కమల్ హాసన్ నటించిన విక్రమ్​ మూవీతో పాటు మరికొన్ని సినిమాలు శుక్రవారం అర్ధరాత్రి ఓటీటీలోకి వచ్చేశాయి. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన 'హ్యాపీ బర్త్‌డే'తో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమయ్యాయి.

movies releasing on friday
ఓటీటీలో 'విక్రమ్'​ సందడి.. థియోటర్​లో లావణ్య 'హ్యాపీ బర్త్‌డే'
author img

By

Published : Jul 8, 2022, 6:00 AM IST

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ విక్రమ్​. ఈ సినిమా.. ఇప్పటికే బిగ్​ స్క్రీన్​పై పెద్ద హిట్​ సాధించగా.. ఇప్పడు ఓటీటీలో సందడి చేస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి.. ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్​టైనర్‏గా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విక్రమ్ మార్క్ కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టి తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విక్రమ్ మూవీ. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ యాక్షన్ చిత్రంలో కమల్ నట విశ్వరూపం చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.

.
.
.
.

థియేటర్లలో..
'మత్తు వదలరా' సినిమాతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన రితేష్ రానా తెరకెక్కించిన మూవీ 'హ్యాపీ బర్త్‌డే'. శుక్రవారం థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, కమెడియన్ సత్యలతో పాటు పలువురు నటీనటులు ఈ చిత్రంలో నటించారు. కొంత కాలంగా హిట్​ లేక సతమతమవుతున్న లావణ్య త్రిపాఠి.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది.

హ్యాపీ బర్త్​డే చిత్రంతో పాటు థియేటర్లలో రానున్న మరికొన్ని సినిమాలివే..
గంధర్వ

నటీనటులు: సందీప్‌ మాధవ్‌, గాయత్రి ఆర్‌.సురేశ్‌, సాయికుమార్‌, సురేశ్‌, బాబూమోహన్‌; దర్శకత్వం: అఫ్సర్‌; విడుదల: జులై 08

  • రుద్ర సింహ
    నటీనటులు: మైత్రీ రెడ్డి, స్నేహ.బి, సంతోష్‌.టి; దర్శకత్వం: కె.మనోహర్‌ మల్లయ్య; విడుదల: జులై 08
  • మా నాన్న నక్సలైట్‌
    నటీనటులు: రఘు కుంచె, కృష్ణ బూర్గుల, రేఖా నిరోషా, అజయ్‌, ఎల్బీ శ్రీరామ్‌ తదితరులు; దర్శకత్వం: పి.సునీల్‌ కుమార్‌రెడ్డి; విడుదల: జులై 08
  • కొండవీడు
    నటీనటులు: సత్యవర్మ, నళినీకాంత్‌, నవీన్‌రాజ్‌ తదితరులు; దర్శకత్వం: సిద్ధార్థ్‌ శ్రీ; విడుదల: జులై 08
  • ఖుదా హఫీజ్‌
    నటీనటులు: విద్యుత్‌ జమ్వాల్‌, శివలీకా ఒబెరాయ్‌, దివ్వేందు భట్టాచార్య, షీబా చద్దా, రాజేశ్‌ తైలింగ్‌; దర్శకత్వం: ఫారూక్‌ కబీర్‌; విడుదల: జులై 08
    .
    .
    .
    .

శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు..

అమెజాన్‌ ప్రైమ్‌

మోడ్రన్‌ లవ్‌: హైదరాబాద్‌ (తెలుగు సిరీస్‌) జులై 8

జీ5

  • సాస్‌ బహూ అచార్‌ జులై 8
  • ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హిందీ సిరీస్‌) జులై 8

నెట్‌ప్లిక్స్‌

  • రణ్‌వీర్‌ వర్సెస్‌ వైల్డ్‌ (రియాల్టీ షో) జులై 8
  • బూ, బిచ్‌ (వెబ్‌ సిరీస్‌) జులై 8
  • ద లాంగెస్ట్‌ నైట్‌ (వెబ్‌సిరీస్‌) జులై 8

ఆహా

జై భజరంగి; జులై 08

ఇదీ చదవండి: సాయి పల్లవి న్యాయపోరాటం.. కట్టిపడేసేలా 'గార్గి' ట్రైలర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.