ETV Bharat / entertainment

బెస్ట్ ఫిల్మ్​గా 'జై భీమ్'... మాల్​లో విశ్వక్ డ్యాన్సులు.. వచ్చేస్తున్న డేగల బాబ్జీ - బ్లాక్‌

MOVIE UPDATES: సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. జై భీమ్​కు బెస్ట్ ఫిల్మ్ అవార్డు, విశ్వక్ సేన్ విజయవాడలో చేసిన సందడి వంటి విశేషాలతో పాటు.. మేజర్, డేగల బాబ్జీ, యశోద చిత్రాల అప్డేట్స్ ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

MOVIE UPDATES
MOVIE UPDATES
author img

By

Published : May 3, 2022, 6:11 PM IST

Jai Bheem dadasaheb phalke: దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్​లో జై భీమ్ సినిమాను పలు అవార్డులు వరించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడి విభాగంలో అవార్డులు దక్కించుకుంది ఈ చిత్రం. సినిమాలో రాజకన్ను పాత్ర పోషించిన మణికందన్​ ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నారు.

విజయవాడలో విశ్వక్ సేన్

Vishwak sen in Vijayawada: యువ కథానాయకుడు విశ్వక్ సేన్ విజయవాడలో సందడి చేశారు. తన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రచారంలో భాగంగా విజయవాడలో పర్యటించిన విశ్వక్ సేన్.... అక్కడి ఓ షాపింగ్ మాల్​లో హంగామా చేశారు. అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడిన అభిమానులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు. అనంతరం రంజాన్ పండుగను పురస్కరించుకొని స్థానిక ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హలీమ్ రుచి చూసి స్థానిక యువతతో సెల్ఫీలు దిగి అలరించారు. మే 6న విడుదల కానున్న తన చిత్రాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Major movie update: మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా 'మేజర్‌'. అడివి శేష్‌ లీడ్ రోల్ చేస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సైతం ఆయనే సమకూర్చారు. శశికిరణ్‌ తిక్క దర్శకుడు. సూపర్​స్టార్ మహేష్‌బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఇండియా సంస్థ మేజర్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్​పై అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. మే 4న ఉదయం 10.08గంటలకు ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపింది.

MOVIE UPDATES
మేజర్

నటుడు, నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన బండ్ల గణేశ్‌ 'డేగల బాబ్జీ'తో చిత్రంతో కథానాయకుడిగా మారాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు వెంకట్‌ చంద్ర తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకురానుంది. గణేశ్‌.. సంబంధిత పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్‌. స్వాతి నిర్మించిన ఈ సినిమాలో గణేశ్‌ పలు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.

MOVIE UPDATES
డేగల బాబ్జీ

కొత్త తేదీతో..: ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా జి.బి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బ్లాక్‌'. మహంకాళి మూవీస్‌ పతాకంపై మహంకాళి దివాకర్‌ నిర్మించారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించినా సాధ్యపడలేదు. రంజాన్‌ సందర్భంగా కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. మే 28న రిలీజ్‌ చేస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శన బానిక్‌, కౌశల్‌ మందా, ఆమని, పృథ్వీరాజ్‌, సూర్య, సత్యం రాజేశ్‌, తాగుబోతు రమేశ్‌, ఆనంద్‌ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కూర్పు: అమర్‌రెడ్డి, కళ: కె.వి.రమణ.

MOVIE UPDATES
ఆది
MOVIE UPDATES
సమంత నటిస్తున్న యశోద ఫస్ట్ గ్లింప్స్ మే 5న ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది.
MOVIE UPDATES
కృష్ణ వ్రింద విహారి చిత్రం నుంచి 'ఏముంది రా' అనే లిరికల్ సాంగ్ బుధవారం సాయంత్రం 4.07 గంటలకు విడుదలవ్వనుంది.
MOVIE UPDATES
రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం మే 5న విడుదల కానుంది.

ఇదీ చదవండి: 'లైగర్' క్రేజ్.. విడుదలకు ముందే రూ.200 కోట్ల బిజినెస్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.