Chiranjeevi mothers day special video: మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని భూమ్మీద ఉన్న తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. తన అమ్మ అంజనాదేవి, సోదరులు పవన్‌కల్యాణ్, నాగబాబులతో కలిసి ఉన్న ఓ స్పెషల్ వీడియోని ఆయన ఆదివారం షేర్ చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 'గాడ్‌ఫాదర్', పవన్ హీరోగా నటించిన 'భీమ్లానాయక్'ల చిత్రీకరణ గతంలో ఓసారి హైదరాబాద్‌లోని ఒకే ప్రాంతంలో జరిగింది. ఎప్పుడూ బిజీగా ఉండే చిరు-పవన్ ఇద్దరూ ఒకే చోట ఉండటంతో అంజనాదేవి, నాగబాబు లొకేషన్‌కి చేరుకుని, సెట్‌లో కాసేపు సమయాన్ని గడిపారు. అందరూ కలిసి సెట్‌లోనే భోజనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోని చిరు షేర్ చేయగా.. సెలబ్రిటీలందరూ హ్యాపీ మదర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చిరంజీవితోపాటు రకుల్‌ప్రీత్ సింగ్, అడివి శేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, సుధీర్‌బాబు, మోహన్‌లాల్.. ఇలా తారలందరూ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
-
అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022అమ్మలందరికీ అభివందనములు !#HappyMothersDay to All The Mothers of the World! pic.twitter.com/FNiVxdY2QL
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 8, 2022
Sohel Mr.Preganant glimpse: 'కథవేరే ఉంటది.. నేను గిట్లనే ఉంట..'’ అంటూ ఓ ప్రముఖ రియాల్టీ షోలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నారు నటుడు సోహెల్. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కథానాయకుడిగా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా నేడు మాతృదినోత్సవం సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది మూవీటీమ్. ఈ వీడియో ఆద్యంతం హృదయాన్ని తాకేలా ఉంది. "9 నెలల కష్టాన్ని.. నవ్వుతూ భరిస్తూ ఒక బిడ్డన్ని జన్మనివ్వడం, అది చావుని తెగించి.. ఈ ఆడవాళ్లు గ్రేట్" అంటూ సోహెల్ చెప్పిన డైలాగ్ మనసుని హత్తుకుంటూ ఆలోచింపజేసేలా ఉంది. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Nani Antey Sundaraniki song: నేచురల్ స్టార్ హీరో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. ఇందులో సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు నాని. బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఎంత చిత్రం సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఫుల్ సాంగ్ ను మే 9న సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, కీర్తన అలపించగా... రామజోగయ్య శాస్ర్తీ సాహిత్యం అందించారు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 జూన్ 10న ఈ సినిమా విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
-
Hope you enjoy our glimpse of #EnthaChithram from #AnteSundaraniki!
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Full song coming tomorrow at 6:03 PM ❤️
- https://t.co/U2IOVXKYkq@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @anuragkulkarni @ramjowrites @keerthanavnath @saregamasouth pic.twitter.com/Htb8NwN1TI
">Hope you enjoy our glimpse of #EnthaChithram from #AnteSundaraniki!
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022
Full song coming tomorrow at 6:03 PM ❤️
- https://t.co/U2IOVXKYkq@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @anuragkulkarni @ramjowrites @keerthanavnath @saregamasouth pic.twitter.com/Htb8NwN1TIHope you enjoy our glimpse of #EnthaChithram from #AnteSundaraniki!
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022
Full song coming tomorrow at 6:03 PM ❤️
- https://t.co/U2IOVXKYkq@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @anuragkulkarni @ramjowrites @keerthanavnath @saregamasouth pic.twitter.com/Htb8NwN1TI
Ram The Warrior movie teaser: రామ్ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ది వారియర్'. జులై 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కృతిశెట్టి హీరోయిన్. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని రెండు భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది మూవీటీమ్. మే 14న సాయంత్ర 5.31 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. 'హై వోల్టేజ్ థండర్' రాబోతుంది అని క్యాప్షన్ జోడించింది. కాగా, ఈ చిత్రంలో రామ్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. ఆయన కెరీర్‌లో తొలిసారి ఖాకీ ధరించింది ఈ చిత్రం కోసమే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా.. సుజీత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం, సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.
-
It's time to Unleash the 𝐖𝐚𝐫𝐫𝐢𝐨𝐫𝐫 within 🔥#TheWarriorrTeaser will be out on May 14 at 5:31 PM#TheWarriorrOnJuly14@ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl pic.twitter.com/6zs9fagrZP
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">It's time to Unleash the 𝐖𝐚𝐫𝐫𝐢𝐨𝐫𝐫 within 🔥#TheWarriorrTeaser will be out on May 14 at 5:31 PM#TheWarriorrOnJuly14@ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl pic.twitter.com/6zs9fagrZP
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 8, 2022It's time to Unleash the 𝐖𝐚𝐫𝐫𝐢𝐨𝐫𝐫 within 🔥#TheWarriorrTeaser will be out on May 14 at 5:31 PM#TheWarriorrOnJuly14@ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl pic.twitter.com/6zs9fagrZP
— Srinivasaa Silver Screen (@SS_Screens) May 8, 2022
F3 movie trailer release date: 'ఎఫ్ 3' చిత్రం నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. మే9న ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మూవీయూనిట్... ఇప్పుడు టైమ్ కూడా ఫిక్స్ చేసేసింది. మే 9న ఉదయం 10.08గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ ప్రచార చిత్రం రన్‌టైమ్ 2.32 నిమిషాల నిడివి ఉన్నట్లు వెల్లడించింది. గతంలో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన 'ఎఫ్2'కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. మొదటి పార్ట్‌లో ఫ్యామిలీతో కలిగే ఫ్రస్టేషన్‌ను చూపించగా ఈ సారి మనీతో మనుషులకు కలిగే ఫ్రస్టేషన్‌ను 'ఎఫ్ 3' ద్వారా చూపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యి రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, మేకింగ్ వీడియోస్ సినిమాపై ఆసక్తి పెంచాయి. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది. ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు.
-
Prepare for the Bombastic FUN Explosion !!! 💥💣#F3Trailer Releasing Tomorrow, May 9th @ 10:08AM ⏰
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
BIGGEST FUN FRANCHISE #F3Movie 🥳@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic #F3OnMay27 pic.twitter.com/4lCKl9Th6Q
">Prepare for the Bombastic FUN Explosion !!! 💥💣#F3Trailer Releasing Tomorrow, May 9th @ 10:08AM ⏰
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022
BIGGEST FUN FRANCHISE #F3Movie 🥳@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic #F3OnMay27 pic.twitter.com/4lCKl9Th6QPrepare for the Bombastic FUN Explosion !!! 💥💣#F3Trailer Releasing Tomorrow, May 9th @ 10:08AM ⏰
— Sri Venkateswara Creations (@SVC_official) May 8, 2022
BIGGEST FUN FRANCHISE #F3Movie 🥳@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic #F3OnMay27 pic.twitter.com/4lCKl9Th6Q
ఇదీ చూడండి: తొలిసారి కొడుకు ఫొటోలు షేర్ చేసిన కాజల్