ETV Bharat / entertainment

Most Entertaining Telugu Movies on Hotstar : హాట్​స్టార్​లో ఎవర్​గ్రీన్ తెలుగు సినిమాలు.. చూశారా? - హాట్​స్టార్​లో ప్రసారమవుతున్న తెలుగు బెస్ట్ మూవీస్

Most Entertaining Telugu Movies on Hotstar : ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. థియేటర్ల కన్నా.. ఓటీటీకే ఓటేసేవారు కూడా ఉన్నారు. వీరు ప్రతి సినిమాను ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు. ఇలా.. వీళ్లు చూసిన బోలెడు తెలుగు సినిమాల్లో.. ఎక్కువగా అలరించిన ఒక 7 చిత్రాలను ఇక్కడ చూద్దాం.

Telugu Movies on Hotstar
Most Entertaining Telugu Movies on Hotstar
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 12:08 PM IST

Telugu Best 7 Movies to Watch on Hotstar : ఇప్పుడంతా ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. కొత్త, పాత అనే తేడాలేకుండా సినిమాలన్నీ ఓటీటీ(OTT) ట్రాక్ ఎక్కేస్తున్నాయి. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన చిత్రాలు కూడా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా సత్తా చాటుతున్నాయి. అలంటి వాటిలో టాప్​లో ఉన్న ఒక 7 చిత్రాలను ఇప్పుడు చూద్దాం.

1. కంచె (2015) : మెగా ప్రిన్స్​ వరుణ్​తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్స్​గా తెరకెక్కిన సినిమా కంచె. ఇందులో రెండు కథలు పారలాల్​గా సాగుతుంటాయి. ఓవైపు సెకండ్​ వరల్డ్​ వార్.. మరోవైపు గ్రామాల్లోని సామాజిక కట్టుబాట్లను సమన్వయం చేస్తూ చూపించాడు దర్శకుడు. మనుషులంతా ఒక్కటే అనే నేపథ్యంతో సాగిన ఈ చిత్రం.. థియేటర్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రం.. ఓటీటీలో సైతం జనాలను అలరిస్తోంది. లక్షలాదిగా ప్రేక్షకులు వీక్షించారు. చూస్తూనే ఉన్నారు.

2. ఆనంద్ (2004) : ఇది నిజంగా మంచి కాఫీలాంటి చిత్రమే. తన కుటుంబం వల్ల రూప (కమలినీ ముఖర్జీ)కు కలిగిన ఇబ్బంది కారణంగా.. ఆమెకు దగ్గరై ఆమెను ప్రేమిస్తుంటాడు ఆనంద్(రాజా). ఈ క్రమంలో వారి మధ్య సాగే సన్నివేశాలు అలరిస్తాయి. తెలుగులో వచ్చిన ఫీల్ గుడ్ మూవీస్​లో "ఆనంద్" తప్పకుండా ఉంటుంది. ఇప్పటికీ క్లాసిక్ మూవీగా అలరిస్తూనే ఉంది.

September Last Week Movie Release : బాక్సాఫీస్ వద్ద వీకెండ్ సందడి.. సినీ లవర్స్​కు ఎంటర్​టైన్​మెంట్​ పక్కా!

3. మీకు మాత్రమే చెప్తా (2019) : "మీకు మాత్రమే చెప్తా" ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పటికే వివాహమైన మహిళతో ప్రేమలో పడే యువకుడి కథే ఈ చిత్రం. దర్శకుడు తనదైన రీతిలో చిత్రాన్ని తెరకెక్కించాడు. థియేటర్లో కన్నా.. ఓటీటీలో ఈ మూవీకి ఆదరణ పెరిగింది.

4. ప్రతి రోజూ పండగే (2019) : ఈ ఆధునిక జీవితంలో అందరూ కెరియర్​ మీద ఫోకస్ చేస్తూ.. కుటుంబ బాంధవ్యాలను గాలికి వదిలేస్తున్నారని చెప్పే చిత్రమిది. ఇలాంటి ఓ కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తాడు కథానాయకుడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం.. చక్కటి కుటుంబ కథా చిత్రంగా మిగిలిపోయింది.

5. ఉయ్యాల జంపాలా (2013) : నిత్యం గిల్లికజ్జాలతో పోట్లాడుకునే చిన్ననాటి స్నేహితులు.. చివరకు ప్రేమికులుగా ఒక్కటయ్యే చిత్రమిది. రాజ్​తరుణ్​, అవికాగోర్ హీరో హీరోయిన్లుగా చక్కటి నటనను కనబరిచారు. ఈ చిత్రం చూస్తే.. అందరికీ ఫస్ట్ లవ్ గుర్తుకు వస్తుందంటే అతిశయోక్తి కాదు. ఎప్పటికీ ఈ చిత్రం అలరిస్తూనే ఉంటుంది.

September Last Week Movies 2023 : ఈ వారం సినిమాల జాతర.. 16 చిత్రాలు, 8 వెబ్​ సిరీస్​లు.. ఆ మూడింటిపైనే భారీ అంచనాలు

6. ఆరెంజ్ (2010) : ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన చిత్రం ఆరెంజ్. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకేవిధంగా ఉండదు.. కాలం గడిచిపోతున్న కొద్దీ.. ప్రేమ తరిగిపోతుంది అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. దీనివల్ల అనివార్యంగా జంటలు కలిసి కాపురం చేస్తాయి తప్ప, మునపటి ప్రేమ ఉండదు అని చెప్పాడు దర్శకుడు. అప్పటి వరకూ ప్రేమంటే ప్రాణం అనే చిత్రాలు చూసి ప్రేక్షకులకు ఈ కాన్సెప్ట్ రుచించలేదు. అందుకే.. థియేటర్లో ఫ్లాప్ అయ్యింది. కానీ.. మారిన కాల పరిస్థితుల ప్రభావమో ఏమోకానీ.. ఓటీటీటీలో తెగ చూసేస్తున్నారు.

7. నువ్వా నేనా (2012) : ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. అల్లరి నరేష్, శర్వానంద్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. హీరోయిన్​ను ఆకట్టుకునేందుకు హీరోలిద్దరూ వేసే వేశాలు అలరిస్తాయి. మరి, ఈ చిత్రాలు మీరు చూశారా..? ఏదైనా చిత్రం చూడలేదు అనుకుంటే.. అవకాశం ఉంటే చూసేయండి.

September OTT Movies : సెప్టెంబర్​లో సినిమాల సందడి.. ఇందులో మీ ఫెవరెట్ మూవీ ఉందా ?

This Week Releasing Movies : హాయ్ మూవీ లవర్స్​.. ఈ వారం థియేటర్​/ఓటీటీలో 10 సినిమాలు.. మీరేం చూస్తారు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.