Miss Perfect Lavanya Tripati : ఇటీవలే టాలీవుడ్ మెగా ప్రిన్స్‌ను పెళ్లాడిన లవాణ్య త్రిపాఠి ప్రస్తుతం 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా విడుదలైన టీజర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అందులో లావణ్య మెయిన్ లీడ్‌గా కనిపించనుండగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఓ యువకుడిగా ఈ వెబ్‌సిరీస్‌లో కనిపించబోతున్నారు. సీనియర్ నటి ఝాన్సీ, 'అమృతం' ఫేమ్ నటుడు హర్షవర్ధన్, సునైనా, అభిజ్ఞ కూడా ఈ వెబ్ సిరీస్‌లో కీ రోల్స్ ప్లే చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
విశ్వక్ కే ఖండేరావ్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఛానల్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. విశ్వక్ గతంలో 'స్కైలాబ్' అనే టాలీవుడ్ సినిమాను తెరకెక్కించారు. ఫుల్ ఆన్ కామెడీ మోడ్‌లో ఉన్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతీ విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండే ఓ అమ్మాయి. అలా ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది ఈ సిరీస్ సారాంశం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక లావణ్య కెరీర్ విషయానికి వస్తే : "నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా" అంటూ క్యూట్‌గా అడుగుతూ 'అందాల రాక్షసి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్' 'సోగ్గాడే చిన్నినాయనా', 'దూసుకెళ్తా', 'శ్రీరస్తు శుభమస్తు', 'రాధా', 'మిస్టర్','అంతరిక్షం','చావుకబురు చల్లగా' సినిమాలతో తెలుగు అభిమానులకు మరించ చేరువయ్యారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడ్డ ఈ చిన్నది ఇటీవలే ఇటలీ వేదికగా వరుణ్‌తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇక సినిమాల్లోనే కాకుండా ఈమె టెలివిజన్ షోస్ వెబ్ సిరీస్‌లోనూ సందడి చేసింది. గతంలో జీ 5 వేదికగా వచ్చిన 'పులి మేక' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
వరుణ్-లావణ్యల పెళ్లి కాస్ట్యూమ్స్ - వామ్మో ఎన్ని లక్షలో తెలుసా?
'ఆ సినిమా కోసం ఫస్ట్ నన్నే అడిగారు - అందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను'