ETV Bharat / entertainment

సూపర్​ హిట్ సిరీస్​ 'మీర్జాపూర్‌ 3' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! - మీర్జాపూర్‌ 3 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Mirzapur Season 3 Release Date : ఓటీటీ లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ డ్రామా 'మీర్జాపూర్‌ 3' విడుదలకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు.

సూపర్​ హిట్ సిరీస్​ 'మీర్జాపూర్‌ 3' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 11:08 AM IST

Mirzapur Season 3 Release Date : క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ 'మీర్జాపూర్‌'. తెలుగు ప్రేక్షకులకు అసలైన మజాను పరిచయం చేసింది. అశ్లీల కంటెంట్ డోస్ కాస్త ఎక్కువే ఉన్నప్పటికీ ఇప్పటికే రిలీజైన రెండు సీజన్లు విశేష ప్రేక్షకాదరణ అందుకున్నాయి. ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించి హిట్‌ అందుకోవడం వల్ల మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ సూపర్​ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ మూడో భాగం మార్చి చివరి వారంలో అమెజాన్‌ ప్రైమ్‌(Mirzapur OTT Amazon Prime) వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితమే దీని షూటింగ్‌ పూర్తైనట్లు ఆ మధ్యలో నటీనటులు అనౌన్స్ చేశారు. ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఈ సిరీస్‌ రిలీజ్​కు రెడీ అయింది.

ఈ సిరీస్​ను గుర్మీత్‌ సింగ్‌ డెరెక్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కింది. మొదటి సీజన్‌ 2018 నవంబరు 16న రిలీజ్ అయింది. పంకజ్‌ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్వేతా త్రిపాఠి, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించిన ఈ తొలి సీజన్‌కు విశేష స్పందన దక్కింది. దీనికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ కూడా రిలీజైంది. ఇదీ కూడా ఓటీటీలో సూపర్‌ హిట్‌ టాక్​తో దూసుకెళ్లింది. తొలి సీజన్‌లో(Mirzapur Story) గుడ్డూ భయ్యా, అతడి తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలను మున్నా ఎలా ఇబ్బంది పెట్టాడని చూపించగా - రెండో సీజన్​లో మున్నాపై గుడ్డూ భయ్యా రీవెంజ్​ ఎలా తీర్చుకున్నాడో బాగా చూపించారు. ఈ సిరీస్​తో గుడ్డూ భయ్యాగా నటించిన అలీ ఫజల్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. దీంతో మూడో సీజన్​పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ మూడో సీజన్​ గ్రిప్పింగ్ స్టోరీ, ఇంటెన్స్ యాక్షన్, ఊహించని ట్విస్ట్​లతో మరింత క్రూరంగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఇందులో విజయ్ వర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.

వీళ్లు సౌత్​ ఇండియన్ ఫిల్మ్​ సూపర్ హీరోస్​!

రిపబ్లిక్‌ డే 'డబ్బింగ్‌' చిత్రాలదే - ఆ మూడు రోజుల్లో 10 సినిమాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.