ETV Bharat / entertainment

బన్నీపై చిరు​-వరుణ్​పై చరణ్ ట్వీట్.. నిమిషాల్లోనే వైరల్​​​ - అల్లుఅర్జున్​ బర్త్​డే విషెస్​

Chiranjeevi birthday wishes Alluarjun: అల్లుఅర్జున్​ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు సినీతారలు, దర్శకనిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా స్పెషల్​ బర్త్​డే విషెస్​ తెలుపుతూ ఓ ట్వీట్​ చేశారు. అది కొన్ని నిమిషాల్లోనే వైరల్​గా మారింది.

Megastar Chiranjeevi wishes to Birthday Boy Alluarjun

author img

By

Published : Apr 8, 2022, 11:39 AM IST

Chiranjeevi birthday wishes Alluarjun: 'పుష్ప' విజయంతో పాన్‌ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్​ను అందుకున్న ఆయన ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. నేడు ఆయన 40వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీతారలు, దర్శకనిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన మేనల్లుడ్ని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ‘"హ్యాపీ బర్త్‌డే బన్నీ. పని పట్ల నువ్వు చూపించే పట్టుదల, కష్టపడేతత్వమే నీకు విజయాలు వరించేలా చేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్‌ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీ చేసుకో" అని చిరు పేర్కొన్నారు.

చిరు చేసిన ట్వీట్‌పై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లైక్స్‌, రిట్వీట్స్‌ రూపంలో తమ రియాక్షన్స్‌ తెలియజేస్తున్నారు. అలా, కొన్ని క్షణాల్లోనే ఈ ట్వీట్‌ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. కాగా, అల్లు అర్జున్‌ పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి తన భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సెర్బియాకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడే ఆయన వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.

Megastar Chiranjeevi wishes to Birthday Boy Alluarjun
బన్నీకి చిరు స్పెషల్​ బర్త్​డే విషెస్​

Ramcharan wishes to Varuntej Gani movie: మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్​ మీమ్‌తో వరుణ్ తేజ్​కు విషెస్ తెలిపారు చరణ్​. ఇటీవల 'ఆర్ఆర్​ఆర్​' ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతున్న సమయంలో రామ్ చరణ్.. ఎన్టీఆర్ వైపు చూస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ బాగా వైరల్ అయింది. ఇప్పుడు అదే ఫోటోలను ఈ మీమ్‌లో వాడారు చెర్రీ. 'ప్రత్యర్థికి చాలా గట్టి పోటీనిచ్చేలా ఉన్నాడు' అని వ్యాఖ్య రాసుకొచ్చారు. దీనికి స్పందించిన వరుణ్​.. 'అన్నా.. లవ్ యూ' అంటూ బదులిచ్చారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'గని’లో వరుణ్ సరసన సాయీ మంజ్రేకర్ నటించింది. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇదీచూడండి: 'గాడ్​ఫాదర్' డబుల్​ కాదు​ ట్రిపుల్ బొనాంజా.. 'కేజీఎఫ్ 2'లో 'సలార్​' గ్లింప్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.