ETV Bharat / entertainment

Gani review: వరుణ్​ తెేజ్​ పంచ్​ బాక్సాఫీస్​పై పడిందా? - గని మూవీ రివ్యూ

Megahero Varuntej Gani movie review: వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా బాక్సింగ్ కథాంశంగా తెరకెక్కిన చిత్రం 'గని'. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు, అల్లు అరవింద్‌ సమర్పకులు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

గని మూవీ రివ్యూ
Gani movie review
author img

By

Published : Apr 8, 2022, 1:58 PM IST

Updated : Apr 8, 2022, 9:10 PM IST

Megahero Varuntej Gani movie review: తెలుగులో అప్పుడ‌ప్పుడు మాత్రమే క్రీడా నేప‌థ్యంలో సినిమాలొస్తుంటాయి. క‌థానాయ‌కులో లేదంటే ద‌ర్శకులో వ్యక్తిగ‌త అభిరుచిగా క్రీడా నేప‌థ్యంలో సినిమాలు చేయాల‌నుకున్నప్పుడు మాత్రమే సాధ్యమ‌వుతుంటాయి. అలా ఈ సారి వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్‌పై ప్రేమ‌ని ప్రద‌ర్శిస్తూ గ‌ని క‌థ‌ని సిద్ధం చేయించారు. మూడేళ్ల కింద‌ట ఈ సినిమా క‌రోనా కారణంగా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఆటంకాలు ఎదుర్కొంది. సినిమా సిద్ధమ‌య్యాక కూడా ప‌లుమార్లు విడుద‌ల తేదీలు వాయిదా ప‌డటం వల్ల రింగు దాటలేదు. ఆల‌స్యమైనా ఎట్టకేల‌కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మ‌రి గని పంచ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈటీవీ భారత్ సమీక్షలోకి వెళ్దాం.ఇదీ కథ బాక్సింగ్ జోలికి వెళ్లన‌ని త‌ల్లి మాధురి(నదియా)కి మాటిచ్చి కూడా... బాక్సర్‌గా రాణించే ప్రయ‌త్నంలో ఉంటాడు గ‌ని (వ‌రుణ్‌తేజ్‌). గ‌నికి ఘ‌న‌మైన వార‌స‌త్వమే ఉంది. త‌ను ఎవ‌రో కాదు, ఒకప్పటి రాష్ట్ర ఛాంపియ‌న్ బాక్సరైన విక్రమాదిత్య (ఉపేంద్ర‌) త‌న‌యుడు. విక్రమాదిత్య జాతీయ ఛాంపియ‌న్‌గా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు సొంత మ‌నుషైన ఈశ్వర్ నాథ్( జగపతిబాబు) చేతుల్లోనే దారుణంగా మోస‌పోతాడు. దానికితోడు స్టెరాయిడ్స్ వినియోగించాడ‌నే మ‌చ్చ కూడా ప‌డుతుంది. అయితే త‌న తండ్రి విష‌యంలో ఏం జ‌రిగిందో తెలియ‌ని గని మొద‌ట ఓ అభిప్రాయంతో ఉంటాడు. త‌న‌దైన ల‌క్ష్యంతో త‌ల్లికిచ్చిన మాట‌ని కూడా ప‌క్కన‌పెట్టి బాక్సింగ్రిం గ్‌లోకి దిగిన గ‌నికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? త‌ను అనుకున్నది ఎలా సాధించాడు? అత‌ని త‌న తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏమిటి? నిజం తెలిశాక ఏం చేశాడు? ఈ క‌థ‌లో విజేంద్రసిన్హా (సునీల్‌శెట్టి) ఎవ‌రన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?... క్రీడా నేప‌థ్యంలో సాగే సినిమాల్లో నాట‌కీయ‌త పుష్కలం. ఆట‌లో ఎత్తులు పైఎత్తులు, ఎవ‌రిదో గెలుపు అనే ఉత్కంఠ‌, ఆ క్రమంలో చోటు చేసుకునే మలుపులు... ఇలా ప్రేక్షకుడిని ర‌క్తిక‌ట్టించే అంశాల‌న్నీ అందులో ఉంటాయి. వీటికి క్రీడా వ్యవ‌స్థలోని రాజ‌కీయాలు, కుటుంబ అనుబంధాల్ని మేళ‌విస్తూ అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్నీ ఆక‌ర్షించేలా సినిమాల్ని రూపొందిస్తుంటారు. `గ‌ని` ఆట కంటే కూడా రెండో అంశంపైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టిన‌ట్టు అనిపిస్తుంది. ఆట‌తో ముడిప‌డిన క‌థానాయ‌కుడి జీవితం ప్రతీకారంతోనే సాగుతుంటుంది. ఆట‌లో ఓడిపోయిన క్రీడాకారుడితోపాటు, అత‌ని కుటుంబ స‌భ్యుల భావోద్వేగాలు, వాళ్లని స‌మాజం చూసే విధానం చుట్టూ ఈ క‌థ‌ని అల్లిన విధానం ప్రత్యేకంగా అనిపిస్తుంది. స్పోర్ట్స్ డ్రామాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమానే అయిన‌ప్పటికీ, క‌థంతా కూడా ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగానే సాగ‌ుతుంది. ప్రథ‌మార్థంలో చెప్పుకోద‌గ్గ క‌థేమీ ఉండదు. విక్రమాదిత్య ఫ్లాష్‌బ్యాక్‌తో క‌థ మొద‌ల‌వుతుంది. గ‌ని, అత‌ని ప్రేమ‌, కుటుంబ నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. విరామ స‌న్నివేశాల్లో ఓ మ‌లుపు ఉంటుంది. ద్వితీయార్థంలోనే అస‌లు క‌థ, డ్రామా. విక్రమాదిత్య మోస‌పోయిన తీరుని ఆవిష్కరిస్తూ ద్వితీయార్థం మొద‌ల‌వుతుంది. క్రీడా వ్యవ‌స్థలోని రాజ‌కీయాలు, బెట్టింగ్ మాఫియా ప్రవేశం వంటి అంశాలు ద్వితీయార్థాన్ని ఆస‌క్తిక‌రంగా మారుస్తాయి. అయితే వీటికి మ‌రింత సంఘ‌ర్షణ జోడించ‌డం అవ‌స‌రం అనిపిస్తుంది. ఇండియన్ బాక్సింగ్ లీగ్ చుట్టూ సాగే స‌న్నివేశాలు వ‌ర్తమాన క్రీడా వ్యవ‌హారాల్ని గుర్తుచేస్తాయి. బాక్సింగ్ నేప‌థ్యం, బ‌ల‌మైన న‌టులు, ఆక‌ట్టుకునే నిర్మాణ విలువ‌లు... సినిమాకి కావ‌ల్సినంత ఆక‌ర్షణ శ‌క్తిని ఇచ్చినప్పటికీ, క‌థ‌నం ప‌రంగా మాత్రం సాదాసీదాగా అనిపిస్తుంది. బాక్సింగ్ ఫైట్స్‌తో సాగే ప‌తాక స‌న్నివేశాల్ని తీసిన విధానం, హంగులు ఆక‌ట్టుకునేలా ఉన్నా... డ్రామా, భావోద్వేగాలు పండ‌లేదు. త‌మ‌న్నా ప్రత్యేక‌గీతం బ‌ల‌వంతంగా జోడించినట్లు ఉంటుంది. త‌మ‌న్నా అందం, నృత్యం మాత్రం అల‌రిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎవ‌రెలా చేశారంటే?... వ‌రుణ్‌తేజ్ న‌ట‌న చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌. బాక్సర్‌గా వరుణ్ క‌నిపించిన విధానం, అందుకోసం త‌న‌ని తాను తీర్చిదిద్దుకున్న తీరు మెప్పిస్తుంది. క్రీడాకారుడిగా చ‌క్కటి భావోద్వేగాల్ని పండించాడు. ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి, జ‌గ‌ప‌తిబాబు పాత్రలు సినిమాకి కీల‌కం. ఉపేంద్ర‌, సునీల్‌శెట్టి బాక్సర్ల పాత్రల‌కి స‌రైన ఎంపిక అనిపిస్తుంది. న‌వీన్​చంద్ర ఆక‌ట్టుకున్నాడు. న‌దియా, సాయీ మంజ్రేక‌ర్ పాత్రల ప‌రిధికి త‌గ్గట్టుగా చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జార్జ్ సి.విలియ‌మ్స్ కెమెరా ప‌నిత‌నం సినిమాకు హైలెట్‌. త‌మ‌న్ బాణీల కంటే కూడా నేప‌థ్య సంగీతం సినిమాకి కీల‌కం. ద‌ర్శకుడు కిర‌ణ్ కొర్రపాటికి ఇదే తొలి సినిమా. క‌థా నేప‌థ్యం ఆక‌ట్టుకున్నా, తీయ‌డంలో ఆయ‌న ప్రద‌ర్శించిన ప‌రిణ‌తి చాల‌లేదు. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు- వ‌రుణ్‌తేజ్ న‌ట‌న, ద్వితీయార్థం, మాటలు, నిర్మాణ విలువ‌లు
బ‌ల‌హీన‌త‌లు- భావోద్వేగాలు పండ‌క‌పోవ‌డం, ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థ
చివ‌రిగా: 'గ‌ని'.. పంచ్ ప‌వ‌ర్ స‌రిపోలేదు అని సినీప్రేక్షకుల టాక్​.

ఇదీ చూడండి: ఊటీలో 'ది ఘోస్ట్'​.. రొమాంటిక్​గా నాగశౌర్య.. 'క్రేజీ' టైటిల్​తో ఆది

Last Updated : Apr 8, 2022, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.