Mega 156 Latest Update : అనుకున్నట్టే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి.. బంగార్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణతో చేయాల్సిన సినిమాను పక్కనపెట్టేశారు. ఇప్పుడు మెగా 156గా బింబిసార ఫేమ్ వశిష్ఠతో వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ స్పష్టత ఇచ్చారు.
భోళాశంకర్ సినిమా రిలీజ్‌కు ముందు మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలను లైన్లో పెట్టారు. ఒకటి కళ్యాణ్ కృష్ణతో మరొకటి వశిష్ఠతో. కళ్యాణ్ కృష్ణ చిత్రం.. మలయాళ హిట్ చిత్రం బ్రో డ్యాడీకి రీమేక్‌గా కథను సిద్ధం చేశారు. చాలా కాలం పాటు స్క్రిప్ట్ సిద్ధం చేసి.. మల్టీస్టారర్‌గా చిరు-శర్వానంద్‌తో కలిసి మెగా 156 చేసేలా ప్లాన్ చేశారు.
Chiranjeevi Vashista Movie : అయితే భోళాశంకర్ రిలీజై భారీ డిజాస్టర్ అందుకోవడంతో చిరుపై భారీగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కథల ఎంపిక మరీ దారుణంగా ఉంటోందని అన్నారు. రీమేక్స్ చేయడం ఆపాలంటూ గట్టిగా సూచించారు. ఈ నేపథ్యంలోనే వశిష్ఠ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ రావడం మొదలయ్యాయి. కానీ కళ్యాణ్ కృష్ణది ఏమీ రాలేదు. దీంతో కల్యాణ్ కృష్ణ సినిమాను చిరు పక్కనపెట్టారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడా ప్రచారాన్నే నిజం చేస్తూ.. దసరా పండగా సందర్భంగా రాత్రికి గ్రాఫిక్స్‌తో డిజైన చేసిన ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
మెగా 157 నెంబర్‌ను మెగా156గా మార్చినట్లు క్లారిటీ ఇచ్చారు. అంటే భోళా శంకర్ తర్వాత ఇప్పుడు చిరు నుంచి రానున్న సినిమా ఇదేనని స్పష్టత వచ్చేసింది. చిరు ఆత్మపరిశీలన చేసుకుని చిరు.. రీమేక్‌కు నో చెప్పి సోషియో ఫాంటసీకి షిఫ్ట్ అయిపోయినట్లు అర్థమైంది.
కాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ రికార్డింగ్ చేసినట్లు తెలిసింది. ఎంఎం కీరవాణి ఒక పాటను రికార్డు చేశారట. సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కీలక పాత్రలో కనిపంచనున్నారని అంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఈ చిత్రం కంప్లీట్ అవ్వడానికి వచ్చే ఏడాది పట్టేలా ఉందని తెలుస్తోంది. 2025 సంక్రాంతి బరిలో సినిమాను దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి మరి ఎప్పుడు వస్తుందో...
-
The forces rise for the MEGA MASS BEYOND UNIVERSE ✨#Mega156 begins 🔮🔥
— UV Creations (@UV_Creations) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Happy Dussehra 🏹
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/utFS8MXO3r
">The forces rise for the MEGA MASS BEYOND UNIVERSE ✨#Mega156 begins 🔮🔥
— UV Creations (@UV_Creations) October 23, 2023
Happy Dussehra 🏹
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/utFS8MXO3rThe forces rise for the MEGA MASS BEYOND UNIVERSE ✨#Mega156 begins 🔮🔥
— UV Creations (@UV_Creations) October 23, 2023
Happy Dussehra 🏹
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/utFS8MXO3r
Bhagvant Kesari Movie : గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య.. ఇక థియేటర్లు మోతే.. ఫ్యాన్స్ పండగ చేసుకోండి
ఆ రికార్డ్ సాధించిన తొలి తెలుగు చిత్రం చిరంజీవిదే.. మెగాస్టార్ కెరీర్‌కు బిగ్ టర్నింగ్ పాయింట్!