ETV Bharat / entertainment

రణ్​బీర్​ సినిమా​ సెట్​లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - సినిమా సెట్​లో అగ్నిప్రమాదం

Fire Accident At Ranbir Film Set: బాలీవుడ్​ నటులు రణ్​బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఓ సినిమా సెట్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.

Massive fire breaks out on film sets in Andheri

author img

By

Published : Jul 30, 2022, 7:32 AM IST

Updated : Jul 30, 2022, 10:25 AM IST

రణ్​బీర్​ సినిమా​ సెట్​లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

Fire Accident At Ranbir Film Set: మహారాష్ట్రలోని ముంబయి శివారు అంధేరి వెస్ట్‌ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్‌ మైదానంలో పక్క పక్కనే వేసిన రెండు సినిమా సెట్టింగులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. సాయంత్రం 4.30 గంటలకు మొదలైన మంటలు రాత్రి తొమ్మిదిన్నరకు అదుపులోకి వచ్చాయి. ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లు, అయిదు నీటి జెట్టీలతో సిబ్బంది శ్రమించారు.

రణ్​బీర్​ ఫిల్మ్​సెట్​లో అగ్నిప్రమాదం
రణ్​బీర్​ ఫిల్మ్​సెట్​లో అగ్నిప్రమాదం

ఈ సెట్టింగుల్లో ఒకచోట రాజశ్రీ ప్రొడక్షన్స్‌ చిత్రం, మరోచోట డైరక్టర్​ లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో రణ్​బీర్​- శ్రద్ధా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త మూవీ చిత్రీకరణలు జరుగుతుండగా అగ్గి రాజుకొన్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ ఇండియా సినీ ఎంప్లాయీస్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ దూబే తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనీశ్‌ దేవాశీ (32) అనే యువకుణ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Massive fire breaks out on film sets in Andheri
సహాయక చర్యల దృశ్యాలు

మంటలను అదుపు చేస్తున్న ఫైర్​ సిబ్బంది

రణ్​బీర్ కపూర్, శ్రద్ధా కపూర్

అయితే రణ్​బీర్​, శ్రద్ధా.. స్పెయిన్​లో సినిమా షూటింగ్​ షెడ్యూల్‌ను ముగించుకుని ఇటీవలే ముంబయి వచ్చారు. ఈ చిత్రంలో బోనీ కపూర్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2023 మార్చి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి: సినీ ఇండస్ట్రీకి గడ్డుకాలం కాదు.. అది నేను నమ్మను: ఎన్టీఆర్​

'నా సినిమా షూటింగ్​కే వచ్చి హీరో ఎవరని నన్నే అడిగారు'

Last Updated : Jul 30, 2022, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.