ETV Bharat / entertainment

'ఇవొక టైమ్​ క్యాప్సూల్స్​ వంటివి' - నాన్నను గుర్తుచేసుకుంటూ మంజుల ఎమోషనల్​ పోస్ట్​! - మంజుల ఘట్టమనేని ఇన్​స్టా ఫొటోస్

Manjula Ghattamaneni Insta Post : సూపర్​స్టార్​ మహేశ్​ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తన ఇన్​స్టా హ్యాండిల్​లో పోస్ట్​ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇంతకీ ఆ పోస్ట్​లో ఏముందంటే..

Manjula Ghattamaneni Insta Emotional Post
Manjula Ghattamaneni Instagram Post
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 3:20 PM IST

Updated : Nov 8, 2023, 3:35 PM IST

Manjula Ghattamaneni Insta Post : సూపర్​స్టార్​ దివంగత క్రిష్ణ కుమార్తె, టాలీవుడ్ హీరో మహేశ్​ బాబు సోదరి మంజుల ఘట్టమనేని తాజాగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తమ ఫ్యామిలీ ఫొటోలను షేర్​ చేశారు. బుధవారం నవంబర్ 8న తన పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈ పోస్ట్ చేశారు. దీంతో పాటు ఓ ఎమోషనల్​ నోట్​ను రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలను చూసిన సూపర్​ స్టార్ ఫ్యాన్స్​ భావోద్వేగానికి లోనవుతున్నారు. ​

సూపర్​స్టార్​ క్రిష్ణ గతేడాది నవంబర్​ 15న కన్నుమూశారు. ఆయన మరణించిన కొద్దిరోజుల ముందు తన కూతురు మంజుల బర్త్​డే సెలబ్రేషన్స్​లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంజులు తన ఇన్​స్టా హ్యాండిల్​లో పోస్ట్ చేసి ఎమోషనల్​ అయ్యారు. అందులో కృష్ణతో పాటు మహేశ్​, నమ్రత, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్​ ఉన్నారు. కుమార్తె బర్త్​డేలో పాల్గొన్న ఆయన.. మంజులకు కేక్​ తినిపించారు.

'ఈ ఫొటోలు నాకు ఓ ప్రపంచం. ఇవొక టైమ్​ క్యాప్సూల్స్​ వంటివి. నా ప్రతి బర్త్​డేకు మా నాన్న నాతో ఉన్నారు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న చిత్రం చివరిసారిగా నా పుట్టినరోజు నాడు నాన్న నాతో గడిపిన క్షణాలు. ఇది నాకు ఎప్పటికీ ఓ మెమోరీలా మిగిలిపోతుంది. ఈ ఫొటోలను నేను ఎప్పటికీ ప్రత్యేకంగా భద్రపరుచుకుంటాను' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కృష్ణ ఆయన కుటుంబంతో కలిసి చివరిసారిగా పాల్గొన్న వేడుక మంజుల బర్త్​డేనే. ఈ ఫొటోలోనే ఆయన చివరసారిగా కనిపించారు.

ఇప్పటికీ కోలుకోని మహేశ్​ ఫ్యామిలీ..
ఘట్టమనేని ఫ్యామిలీకి 2022 సంవత్సరం అంతగా కలిసి రాలేదని అంటారు చాలామంది​. ఎందుకంటే గతేడాది వీరి కుటుంబంలో ఏకంగా ముగ్గురు వ్యక్తులు కన్నుమూశారు. ఒకరు కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్​ బాబు 2022 జనవరి 8న మరణించగా.. మహేశ్​ బాబు మాతృమూర్తి ఇందిరా దేవీ స్వర్గస్తులయ్యారు. ఇక నెలన్నర వ్యవధిలోనే సూపర్​స్టార్​ కృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా వరుస మరణాలతో ఒకే ఏడాదిలో అయిన వాళ్లను కోల్పోయిన మహేశ్​ బాబు ఫ్యామిలీ ఇప్పటికీ కోలుకోలేదని అంటారు ఆయన సన్నిహితులు.

​ NBK 109 బిగ్ అనౌన్స్​మెంట్ - 'బాలయ్య' యాక్షన్ షూరూ

'సినిమాలో నా పాత్ర ఓ సర్​ప్రైజ్​- కార్తితో నా ట్రాక్​ అదుర్స్​, 'జపాన్​' కోసం ఫుల్ వెయిటింగ్​'!

Last Updated : Nov 8, 2023, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.