ETV Bharat / entertainment

ఉత్కంఠగా పాయల్​ 'మంగళవారం' టీజర్​.. మ్యూజిక్ హైలైట్​ - మంగళవారం టీజర్

Mangalavaram teaser : 'ఆర్ఎక్స్100' ఫేమ్​ దర్శకుడు అజయ్​ భూపతి-హీరోయిన్ పాయల్​ రాజ్​పుత్ కలిసి చేస్తున్న కొత్త చిత్రం 'మంగళవారం'. తాజాాగా రిలీజైన ఈ టీజర్​ ఉత్కంఠభరితంగా ఉంది.

Mangalavaram teaser
ఉత్కంఠభరితంగా పాయల్​ 'మంగళవారం' టీజర్​.. మ్యూజిక్ హైలైట్​
author img

By

Published : Jul 4, 2023, 11:18 AM IST

Updated : Jul 4, 2023, 12:14 PM IST

Mangalavaram teaser : 'ఆర్ఎక్స్100' కాంబో దర్శకుడు అజయ్​ భూపతి-హీరోయిన్ పాయల్​ రాజ్​పుత్​ కలిసి చేస్తున్న తాజా చిత్రం 'మంగళవారం'. ఇప్పటికే టైటిల్​ అండ్​ ఫస్ట్​ లుక్ పోస్ట్​తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన మూవీటీమ్​.. ఇప్పుడు తాజాగా 'ఫియర్ ఇన్​ ఐస్​' కళ్లలో భయం అనే పేరుతో టీజర్​ను రిలీజ్​ చేసి ఆ ఆసక్తిని మరింత పెంచేసింది.

ఈ టీజర్​ ఆద్యంతం చాలా ఆసక్తిగా, ఉత్కంఠభరితంగా కొనసాగింది. పొలాల మధ్య సీతాకోకచిలుకలు గుండ్రంగా ఎగరడంతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో మొదటగా ఓ అమ్మవారి ఆలయాన్ని చూపించారు. దాంతో పాటే టీజర్​ ప్రతి షాట్​లోనూ అందరి కళ్లనే హైలైట్​ చేస్తూ వారందరూ భయంతో పైకి చూస్తున్నట్లుగా చూపించారు. మధ్య మధ్యలో పాయల్​కు సంబంధించిన కొన్ని ప్రత్యేక షాట్స్​ను చూపించి సస్పెన్స్ క్రియేట్​ చేశారు. అందులో ఆమెను బోల్డ్ అండ్​ సీరియస్​,​​ ఎమోషనల్​గా చూపించారు. అయితే ఆమె పాత్ర ఏంటనేది రివీల్ చేయకుండా సస్పెన్స్​లో పెట్టారు.

ఇంకా ఈ ప్రచార చిత్రంలో ఎవరో ఓ వ్యక్తి ముఖానికి అమ్మవారి మాస్క్​ వేసుకుని ఉన్నట్లు రెండు మూడు షాట్లో చూపించడం చాలా ఆసక్తిగా ఉంది. ఈ పాత్ర చుట్టే కథ తిరుగుతుందేమో అనిపిస్తోంది. చివరికి కూడా అమ్మవారి విగ్రహాన్ని, మాస్క్​ను మరోసారి చూపించి ప్రచార చిత్రాన్ని ముగించారు. కానీ ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం అస్సలు రివీల్ చేయలేదు. అలానే ప్రారంభంలో గుంపుగా ఉన్న సీతాకోకా చిలుకలను చూపించగా.. చివర్లో ముగించేటప్పుడు కూడా బ్యాక్​గ్రౌండ్​లో ఓ పెద్ద సీతాకోక చిలుక పోస్టర్​ను చూపించారు.

అయితే ఈ టీజర్​ మొత్తం ఒక ఎత్తైతే.. 'కాంతార' ఫేమ్​ బి అజనీశ్​ లోక్​నాథ్​ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ మరో ఎత్తు. అదే ఈ ప్రచార చిత్రానికి హైలైట్​గా నిలిచింది. ఈ బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ వింటుంటే గూస్​బంప్స్ వచ్చేలా ఉన్నాయి. అదో తెలియని ఉత్కంఠత, భయాన్ని పుట్టిస్తోంది. మొత్తంగా కథను రివీల్ చేయలేదు కానీ.. ఈ చిత్రం విలేజ్​ బ్యాక్​గ్రౌండ్​లో​ సాగే ఓ సస్పెన్స్​ యాక్షన్​ ​ థ్రిల్లర్​ అని మూవీటీమ్​ అంటోంది.

'ఆర్ఎక్స్100', 'మహా సముద్రం' సినిమాల తర్వాత మూడో చిత్రంగా ఈ 'మంగళవారం'ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్​ అజయ్ భూపతి. 'ఆర్ఎక్స్100' సూపర్ హిట్ అవ్వగా.. 'మహా సముద్రం' ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ మంగళవారం మాత్రం ఎక్స్​పెక్టేషన్స్​ను పెంచేసింది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయినట్లు తెలిసింది. ఇక ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్​తో పాటు అజయ్​ ఘోష్, లక్ష్మణ్​, చైతన్య కృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి :

బెడ్​పై పాయల్ పరువాల విందు.. బాబోయ్​ ఆ పోజులు చూస్తే..

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న 'ఆర్​ఎక్స్​100' హాట్​ బ్యూటీ

Last Updated : Jul 4, 2023, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.