ETV Bharat / entertainment

పాయల్​ రాజ్​పుత్ పాన్ ఇండియా థ్రిల్లర్​ -​ 'మంగళవారం' మూవీ ఎలా ఉందంటే ?

Mangalavaram Movie Twitter Review : 'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్​ నటి పాయల్​ రాజ్​పుత్​ - డైరెక్టర్ అజయ్ భూపతి కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ 'మంగళవారం'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం (నవంబర్​ 17)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

Mangalavaram Movie Twitter Review
Mangalavaram Movie Twitter Review
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 6:45 AM IST

Updated : Nov 17, 2023, 7:09 AM IST

Mangalavaram Movie Telugu Review : టాలీవుడ్​ స్టార్ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్​ రోల్​లో తెరకెక్కిన తాజా మూవీ 'మంగళవారం'. 'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్​ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్​లో శుక్రవారం (నవంబర్​ 17)న థియేటర్లలోకి విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..

స్టోరీ ఏంటంటే : మ‌హాల‌క్ష్మీపురంలో వ‌రుస‌గా రెండు జంట‌ల‌ ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. అదీ ఆ గ్రామ దేవ‌త మాల‌చ్చ‌మ్మ‌కి ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజున‌. అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఊరి గోడల‌పై రాసిన రాత‌ల వ‌ల్లేనే వాళ్లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డి ఉంటార‌ంటూ గ్రామ‌స్తులు న‌మ్ముతారు. కానీ, ఆ ఊరికి కొత్త‌గా వ‌చ్చిన మాయ అనే ఎస్సై (నందిత శ్వేత‌) మాత్రం అవి ఆత్మ‌హ‌త్య‌లు కావు హ‌త్య‌ల‌ని న‌మ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శ‌వాల‌కు పోస్ట్‌మార్టం చేయించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న సమయంలో ఆ ఊరి జ‌మిందారు ప్ర‌కాశం బాబు (చైత‌న్య కృష్ణ‌) అడ్డు చెబుతాడు. అత‌ని మాట‌కు ఊరు కూడా వంత పాడ‌టం వల్ల మొద‌టిసారి మాయ తొలిసారి తన ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంటుంది. కానీ, రెండో జంట చ‌నిపోయిన‌ప్పుడు మాత్రం ఊరి వాళ్ల‌ను ఎదురించి మ‌రీ పోస్టుమార్టం చేయిస్తుంది.

మరోవైపు గోడ‌ల‌పై రాత‌లు రాస్తున్న అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో క‌నిపెట్టేందుకు ఊరి వాళ్లు రంగంలోకి దిగుతారు. మ‌రి ఆ ఊర్లో జ‌రిగిన‌వి ఆత్మ‌హ‌త్య‌లా? లేక హ‌త్య‌లా? ఈ చావుల వెన‌కున్న ల‌క్ష్యం ఏంటి? వీటికి ఆ ఊరి నుంచి వెలివేయ‌బ‌డ్డ శైల‌జ అలియాస్ శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌)కు ఉన్న సంబంధం ఏంటి? అస‌లు ఆమె స్టోరీ ఏంటి? ఆ ఊర్లో జ‌రిగే చావులకు ఆ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫ‌ర్ వాసు (శ్ర‌వ‌ణ్ రెడ్డి), డాక్ట‌ర్ (ర‌వీంద్ర విజ‌య్), జ‌మిందారుకు.. అత‌ని భార్య (దివ్యా పిళ్లై)కు ఏమైనా సంబంధం ఉందా? అసలు శైలు చిన్న‌నాటి ప్రియుడు ర‌వి క‌థేంటి? అన్న‌దే మిగ‌తా స్టోరీ.

ఎలా ఉందంటే: 'మంగళవారం' మూవీ ఓ మిస్టీక్ థ్రిల్ల‌ర్. మ‌ధ్యలో హార‌ర్ ట‌చ్ ఇచ్చి.. ఆ త‌ర్వాత ఓ రివేంజ్ డ్రామాలా కొన‌సాగించిన డైరెక్టర్​.. ఆఖ‌ర్లో ఓ చిన్న సందేశంతో ఈ సినిమాను ముగించారు. ఆ సందేశం ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు సంబంధించిన‌ది. అయితే దాన్ని చెప్పేందుకు అల్లుకున్న పాయింట్ కొత్త‌గా ఉన్నప్పటికీ.. దాన్ని ప్రేక్ష‌కులు ఏ కోణంలో చూస్తార‌న్న దానిపై మూవీ రిజల్ట్​ ఆధార‌ప‌డి ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని అక్ర‌మ సంబంధాల వ్య‌వహారం.. కొన్ని ద్వంద్వార్థ సంభాష‌ణ‌లు.. హీరోయిన్​కు ఉన్న స‌మ‌స్య వంటివి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు కాస్త ఎబ్బెట్టుగా అనిపించొచ్చు.

అయితే ఈ సినిమాలో ఉన్నఓ ప్ర‌త్యేక‌త ఏంటంటే..ఇంటర్వెల్​ ముందు వరకు లీడ్​ రోల్​ క‌నిపించ‌కున్నా.. అస‌లు క‌థ మొద‌లు కాకున్నా.. ఎక్క‌డా బోర్ కొట్టించ‌కుండా అలా స్టోరీనీ ముందుకు న‌డిపించారు ద‌ర్శ‌కుడు అజ‌య్‌. శైలు చిన్న‌త‌నం ఎపిసోడ్‌తో చిత్రం ఆస‌క్తిక‌రంగా మొద‌ల‌వుతుంది. ర‌వితో ఆమె చిన్న‌నాటి ప్రేమ‌క‌థ‌.. ఇంట్లో తండ్రితో ప‌డే ఇబ్బందులు.. ర‌వి కుటుంబ నేప‌థ్యం.. తొలి 15 నిమిషాలు వీటితోనే ముందుకు న‌డిపారు. ఆ త‌ర్వాత క‌థ ప్రెజెంట్​లోకి వ‌స్తుంది.

Mangalavaram Movie Review In Telugu : మ‌హాల‌క్ష్మీపురం.. అందులోని ఒక్కో పాత్ర‌ల వ్య‌క్తిత్వాల్ని ప‌రిచ‌యం చేస్తూ సినిమా నెమ్మ‌దిగా ముందుకు సాగుతుంది. అక్ర‌మ సంబంధం పెట్టుకున్న జంట‌ల పేర్లను ఎవ‌రో అజ్ఞాత వ్య‌క్తి ఊరి గోడ‌ల‌పై రాస్తుండ‌టం వల్ల.. మ‌రుస‌టి రోజే ఆ జంట‌లు క‌న్నుమూయ‌డం.. గ్రామ దేవ‌త‌కు ఇష్ట‌మైన మంగ‌ళ‌వారం రోజునే ఈ చావులు సంభ‌విస్తున్నాయ‌ని ఊరి వాళ్లంతా ఆందోళ‌న చెందడం.. గోడ‌ల‌పై రాత‌లు రాస్తున్న ఆ అజ్ఞాత వ్య‌క్తిని ప‌ట్టుకునేందుకు గ్రామ ప్రజలంతా రంగంలోకి దిగ‌డం.. ఇలా క్ర‌మంగా ఆస‌క్తిపెంచుతూ క‌థ వేగం పుంజుకుంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే విరామ స‌న్నివేశాలు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తాయి. ఇక్క‌డి నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

సెకెండాఫ్​ మ‌ళ్లీ శైలు గ‌తంతోనే మొద‌ల‌వుతుంది. అయితే ఫస్ట్​హాఫ్​తో పోలిస్తే ఇక్క‌డి నుంచి క‌థ కాస్త నెమ్మ‌దిగా సాగిన‌ట్లు అనిపిస్తుంది. కాలేజీలో శైలూకు.. ఇంగ్లీష్ లెక్చ‌ర‌ర్ మ‌దన్‌కూ మ‌ధ్య న‌డిచే ప్రేమ‌క‌థ సోసోగా అనిపిస్తుంది. వీరి మ‌ధ్య వ‌చ్చే ఓ రొమాంటిక్ గీతం యువ‌త‌రానికి న‌చ్చేలా ఉంటుంది. శైలుకు జ‌రిగిన అన్యాయం.. ఆమెకున్న మాన‌సిక రుగ్మ‌త.. దానివ‌ల్ల త‌ను ప‌డే యాత‌న ఎమోషనల్​గా ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్‌ను ప్రేక్ష‌కులు ఏ కోణంలో చూస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రమైన విషయం. ప‌తాక స‌న్నివేశాలు మంచి ట్విస్ట్‌ల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. సినిమాను ముగించిన తీరు కాస్త అసంతృప్తిగానే అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: శైలు పాత్ర‌లో పాయ‌ల్ చ‌క్క‌గా ఒదిగిపోయారు. గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్రలో ఆమె బాగా నటించారు. అయితే త‌ను ఈ సినిమాలో సెకెండాఫ్​లోనే క‌నిపిస్తారు. ఎమోషనల్​ సీన్స్​లో చ‌క్క‌గా జీవించారు. ఎస్సై పాత్ర‌లో నందితా శ్వేత ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో క‌నిపించారు. అయితే న‌ట‌న ప‌రంగా ఆమెకు పెద్ద‌గా ప్ర‌తిభ చూపించుకునే ఆస్కారం ఈ సినిమాలో దొర‌క‌లేదు. అజ‌య్ ఘోష్ - ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ ట్రాక్ ఆడియెన్స్​ను నవ్విస్తుంది. జ‌మిందారుగా చైత‌న్య కృష్ణ పాత్ర‌ను మంచిగా డిజైన్ చేశారు. శ్రీతేజ్‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, ర‌వీంద్ర విజ‌య్ త‌దిత‌రులు తమ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు నటించారు. అజ‌య్ రాసుకున్న క‌థ కుటుంబ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌క‌పోవ‌చ్చు.

Mangalavaram Movie Cast : ఫస్ట్​ హాఫ్​లో అస‌లు క‌థే క‌నిపించ‌క‌పోవ‌డం.. సెకెండాఫ్​లో చాలా పాత్ర‌ల‌కు స‌రైన ముగింపు లేక‌పోవ‌డం లోపం. హీరోయిన్ చిన్న‌నాటి ప్రియుడు.. మాస్క్ వెన‌క మ‌నిషి విష‌యంలో ఓ మీడియం రేంజ్ నటుడిని రంగంలోకి దించుంటే బాగుండేది అనిపిస్తుంది. టెక్నిక‌ల్‌గా ఈ సినిమా ఉన్న‌త స్థాయిలో క‌నిపిస్తుంది. మ్యూజిక్​ డైరెక్టర్​ అజ‌నీష్ లోకనాథ్​ బ్యాక్​గ్రౌండ్ స్కోర్​ ఈ సినిమాకు ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చింది. జాతర పాట‌ను స్వ‌ర‌ప‌రిచిన తీరు.. దాన్ని తెర‌పై చిత్రీక‌రించిన విధానం ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి. అలాగే శివేంద్ర సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు కూడా ఉన్న‌తంగానే ఉన్నాయి.

  • బ‌లాలు
  • + పాయ‌ల్ న‌ట‌న‌.. గ్లామ‌ర్‌
  • + అజ‌నీష్ సంగీతం
  • + ద్వితీయార్ధంలో ట్విస్ట్‌లు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నెమ్మ‌దిగా సాగే క‌థ‌నం..
  • - ముగింపు
  • చివ‌రిగా: మ‌ంగళవారం.. బోల్డ్‌ థ్రిల్లర్‌
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఆ పాత్ర వల్ల ఇండస్ట్రీ నన్ను ఆ కోణంలోనే చూసింది - కానీ నేను మాత్రం!'

'ఆ 45 నిమిషాల్లో అసలు ట్విస్ట్ - ప్రేక్షకులు తప్పక కన్నీళ్లు పెట్టుకుంటారు'

Last Updated : Nov 17, 2023, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.