ETV Bharat / entertainment

Manchu Vishnu Injured : మంచు విష్ణుకు గాయాలు? 'కన్నప్ప' సినిమా సెట్​లో!

Manchu Vishnu Injured In Shooting Set : నటుడు మంచు విష్ణుకు గాయాలు అయినట్లు సమాచారం. న్యూజిలాండ్​లో జరుగుతున్న 'కన్నప్ప' సినిమా షూటింగ్​లో​ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Manchu Vishnu Injured In Shooting Set
Manchu Vishnu Injured In Shooting Set
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 10:47 PM IST

Manchu Vishnu Injured In Shooting Set : నటుడు మంచు విష్ణుకు షూటింగ్​ సెట్​లో గాయాలు అయినట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రం 'కన్నప్ప' షూట్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా డ్రోన్ కెమెరా అదుపు తప్పి విష్ణు మీదకి దూసుకురావడం వల్ల చేతికి స్వల్ప గాయాలయ్యానని సమాచారం. దీంతో ప్రస్తుతానికి షూట్‌ను నిలిపి వేశారని తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై విష్ణు గానీ, సినిమా బృందం గానీ అధికారికంగా స్పందించలేదు.

Kannappa Movie Cast : ఇదిలా ఉండగా.. విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా 'కన్నప్ప' రూపొందుతోంది. ఈ సినిమా ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 'కన్నప్ప' చిత్రం మొత్తాన్ని న్యూజిలాండ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తయారు చేయించిన ఆర్ట్‌ వర్క్‌ మొత్తాన్ని న్యూజిలాండ్​కు తరలించారు. కాగా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ అగ్ర నటుడు మోహన్‌ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్​గా మొదట నుపుర్‌ సనన్‌ను ఎంపిక చేశారు. కానీ డేట్స్‌ సర్దుబాటు కాకపోవడం వల్ల ఆమెను ఈ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వెళ్లారు. అంతేకాకుండా పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్‌, లేడీ సూపర్ స్టార్ నయనతార, కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌, మలయాళీ మెగాస్టార్ మోహల్‌ లాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు రచయితలుగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ, మలయాళ మ్యూజిక్​ డైరెక్టర్​ స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.

'కన్నప్ప' కథ అదే!
'మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాం. కన్నప్ప వృత్తాంతం 2వ శతాబ్దంలో జరిగింది, ప్రస్తుతం ఇక్కడి పరిసరాల్లో సినిమా తీయడం వీలుకాదు. అందుకోసం ఈ చిత్రం నిర్మాణానికి ఆర్నెళ్లపాటు న్యూజిల్యాండ్‌కు వెళ్తున్నాం. కన్నప్ప భక్తిని, ఆయన గొప్పతనాన్నీ నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో పాన్‌ ఇండియా రేంజ్​లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. భారీ బడ్జెట్‌తో... అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నాం. ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం' అని ఈ సినిమా ఓపెనింగ్‌ సందర్భంగా విష్ణు తెలిపారు.

Varun Lavanya Marriage : వరుణ్​- లావణ్య పెళ్లికి చిరంజీవి తల్లి దూరం.. కారణమిదే!

Pawan Kalyan OG Cast : 'ఓజీ'లోకి మరో సీనియర్​ హీరో.. అప్పుడు అన్నయ్యతో ఇప్పుడు తమ్ముడితో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.