ETV Bharat / entertainment

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన మంచు విష్ణు.. ఆ ఛానళ్లకు వార్నింగ్​

నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనతో సహా తన కుటుంబ సభ్యులపై జరుగుతున్న ట్రోలింగ్​ నేపథ్యంలో సైబర్​కు ఫిర్యాదు చేశారు.

author img

By

Published : Sep 29, 2022, 4:49 PM IST

manchu vishnu
మంచు విష్ణు
మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం నుంచి తనతో పాటు తన కుటుంబంపై సోషల్​మీడియాలో కొంత మంది తప్పుగా ట్రోల్స్ చేస్తున్నారని సినీనటుడు, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఓ ప్రముఖ నటుడి ఆధ్వర్యంలో జూబీహిల్స్, బంజారాహిల్స్​లోని రెండు కేంద్రాల నుంచి డబ్బులు పెట్టి తనపై ట్రోల్స్ చేయిస్తున్నారని తెలిసిందని ఆరోపించారు.

ప్రజలు తమను తప్పుగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ ట్రోల్స్​పై కోర్టును ఆశ్రయించినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే 18 యూట్యూబ్ ఛాన్సల్ పై చర్యలు తీసుకోనున్నట్లు విష్ణు హెచ్చరించారు. ఆన్​లైన్​ మీడియా పెరగడం వల్ల అవగాహన లేని చాలా మంది ట్రోల్స్ చేస్తూ తనలాంటి వాళ్ల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విష్ణు వాపోయారు.

ఇదీ చూడండి: సతీమణి స్నేహారెడ్డి బర్త్​డే.. గోల్డెన్​ టెంపుల్​లో బన్నీ సెలబ్రేషన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.