ETV Bharat / entertainment

గుడ్​ న్యూస్​ చెప్పిన మంచు మనోజ్​ - త్వరలో తండ్రి కాబోతున్నంటూ ట్వీట్ - మంచు మనోజ్‌ వైఫ్​ ప్రెగ్నెంట్

Manchu Manoj Latest Tweet : టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్‌ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ శుభవార్త చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి కానున్న సంతోషకరమైన విషయాన్ని తెలిపారు.

Manchu Manoj Latest Tweet
Manchu Manoj Latest Tweet
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 9:42 PM IST

Manchu Manoj Latest Tweet : టాలీవుడ్ స్టార్ హీరో మంచు మనోజ్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన సతీమణి మౌనిక త్వరలో తల్లి కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మనోజ్‌ ట్వీట్టర్ అకౌంట్​లో షేర్ చేశారు. తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని ఫ్యాన్స్​తో పంచుకున్నారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమపై ఉండాలని నెటిజన్లను కోరుకున్నారు. ఇక ఈ వార్త చూసిన అభిమానులు మనోజ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

  • "Remembering and honoring my beloved Athamma, Shree Bhuma Shoba Nagi Reddy garu, on her birthday 🙏🏼❤️

    Athamma. In your loving embrace, we find comfort in sharing joyful news: Shree Bhuma Nagi Reddy Mama and you are becoming grandparents once again. Our little Dhairav is… pic.twitter.com/7ZIXk5rPtn

    — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Manoj Mounika Marriage : ఇక మనోజ్‌ - మౌనిక ఎంతోకాలం నుంచి స్నేహితులగా ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి స్నేహ బంధం ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ఏడాది మార్చి నెలలో వీరి వివాహం జరిగింది.

మరోవైపు మనోజ్‌ ప్రస్తుతం 'వాట్‌ ది ఫిష్‌' అనే సినిమాలో లీడ్​ రోల్​ చేస్తున్నారు. వరుణ్‌ కోరుకొండ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ వర్క్​ కొనసాగుతోంది. అంతే కాకుండా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలోనే ఓ చిత్రానికి సైన్​ చేశారు. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే టీజర్‌తో ఆ సినిమాను అనౌన్స్​ చేయనున్నారు.

హోస్ట్​గా మనోజ్​ - అలరిస్తున్న 'ఉస్తాద్'
Manchu Manoj Ustaad Show : 'వేదం', 'బిందాస్‌', 'కరెంట్‌ తీగ' లాంటి చిత్రాలతో అలరించిన ఆయన ఏడేళ్ల విరామం తర్వాత ఆయన 'ఉస్తాద్‌' అనే సెలబ్రిటీ గేమ్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక 'ఈటీవీ విన్‌'లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి సీజన్‌లో మొత్తం 13 ఎపిసోడ్‌లు ఉంటాయని అందులో అతిథులుగా పాల్గొనే స్టార్లెవరన్నది మాత్రం సర్‌ప్రైజ్‌ అంటూ ఇటీవలే మనోజ్​ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతే కాకుండా బోలెడంత థ్రిల్‌, ఎమోషన్స్‌తో నిండిన షో ఇది. ఎంతో వినోదాన్ని పంచనుంది అంటూ ఆయన షో పట్ల ధీమా వ్యక్తం చేశారు.

రవితేజ మల్టీ స్టారర్​లో విశ్వక్ సేన్​.. విలన్​గా మంచు మనోజ్​?

ఫ్యాన్స్​కు మనోజ్ రిటర్న్​ గిఫ్ట్ - 'ఉస్తాద్' ప్రోమో రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.