ETV Bharat / entertainment

'మేజర్' టీమ్​​ కీలక ప్రకటన.. ఆర్మీలో చేరాలనుకునేవారికి సాయం

Major movie success meet: 'మేజర్‌' చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. ఆర్మీలో చేరాలనుకునే యువతకు తమ వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు తెలిపింది.

Major movie press meet
మేజర్ మూవీ సక్సెస్​ మీట్​
author img

By

Published : Jun 4, 2022, 3:41 PM IST

Major movie success meet: "ఆర్మీలో చేరాలనుకునే యువతకు తమ వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు".. 'మేజర్‌' చిత్రబృందం ప్రకటించింది. ముంబయి ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి వీరమరణం చెందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'మేజర్‌'. శశికిరణ్‌ దర్శకుడు. జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్​ హిట్​ అయింది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో 'మేజర్‌' సక్సెస్‌ మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో అడివి శేష్‌ మాట్లాడుతూ.. "సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. 'మేజర్‌' సినిమా చూసి ఆర్మీలో చేరాలనుకుంటున్నట్లు చాలామంది తనకి మెస్సేజ్‌లు చేశారని అన్నారు.

"ఇండస్ట్రీలో ఓ మాట ఉంది. సినిమా రిలీజైన రోజు వరుసగా ఫోన్‌కాల్స్‌ వస్తే ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌. ఎలాంటి ఫోన్‌కాల్స్‌ రాకుండా కేవలం 'మీ సినిమా గురించి మంచి టాక్‌ వింటున్నాం' అని మెస్సేజ్‌లు వస్తే సినిమా పర్వాలేదని. నిన్నటి నుంచి నా ఫోన్‌కి అస్సలు ఖాళీ లేదు. ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా.. ఎలా చూసుకున్న 'మేజర్‌' ఇప్పటివరకూ వచ్చిన చిత్రాలతో పోలిస్తే ఐదు లేదా పది రెట్లు ఎక్కువే సాధించింది. 'సినిమా హిట్‌ అయ్యింది కదా ఇంక ప్రశాంతంగా ఉండు' అని అందరూ చెబుతున్నారు. కానీ, సందీప్‌ ఆశయాలను, ఆయన కథను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇంకా ఏదో చేయాలని ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నేను ఇంకా చేస్తా. ఈరోజు ఓ ముగ్గుర్ని నేను బాగా మిస్‌ అవుతున్నా. సందీప్‌ వాళ్ల తల్లిదండ్రులు. సినిమా రిలీజ్‌ అయ్యేవరకూ వాళ్లు నాతోనే ఉన్నారు. నా గురువు అబ్బూరి రవిని ఎంతగానో మిస్‌ అవుతున్నా. వేరే మీటింగ్స్‌ ఉండటం వల్ల ఈరోజు ఆయన ఇక్కడికి రాలేకపోయారు. అలాగే నా సోదరి, స్టైలిష్ట్‌ కూడా ఈరోజు ఇక్కడ మిస్‌ అవుతున్నా"

" మేజర్‌ చూసి ఆర్మీలో జాయిన్‌ అవ్వాలనుకుంటున్నా అని చాలామంది మెస్సేజ్‌లు పెడుతున్నారు. అలాంటి వాళ్లందరి కోసం ఇదే మా 'మేజర్‌' ప్రామిస్‌. ఆర్మీలో జాయిన్‌ కావాలని కలలు కనేవాళ్లకు మేము సపోర్ట్‌ చేయాలనుకుంటున్నాం. ఎలా అన్నది త్వరలో చెబుతాం. మొదట పదిమందితో ప్రారంభించినా, భవిష్యత్తులో కోట్ల మందికి చేరువవుతుందని అనుకుంటున్నా. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పేరుతోనే దీన్ని ప్రారంభించాలనుకుంటున్నా" అని శేష్​ వివరించారు.

ఈ సినిమా దర్శకుడు శశికిరణ్‌ మాట్లాడుతూ.. "సినిమా షూట్‌ సమయంలో తన తండ్రి చనిపోయారంటూ చెప్పి భావోద్వేగానికి గురయ్యారు. సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, రేవతిల పాత్రలు చూస్తుంటే అందరిలాగే తనకి కూడా తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని" ఆయన అన్నారు.

ఇదీ చూడండి: చీర కట్టినా.. బికినీ వేసినా.. ఈ ముద్దుగుమ్మ అందాలు కెవ్వు కేకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.