ETV Bharat / entertainment

సక్సెస్​ ఈవెంట్.. ఆనందంతో స్టేజ్​పై మహేశ్​ చిందులు - మహేశ్​బాబు సర్కారు వారి పాట కొత్త ట్రైలర్​

SarkaruVaari paata movie success event: 'సర్కారు వారి పాట' విజయోత్సవ వేడుకలో మహేశ్​బాబు స్టేజ్​ ఎక్కి స్టెప్పులేశారు. దీంతో పాటే 'సమ్మర్‌ సెన్సేషనల్‌ బ్లాక్‌ బ్లస్టర్‌' పేరుతో సినిమాకు సంబంధించిన మరో కొత్త ట్రైలర్​ను విడుదల చేశారు.

Maheshbabu Sarkaru Vaaripaata movie success meet
సర్కారు వారి పాట సక్సెస్​ ఈవెంట్
author img

By

Published : May 16, 2022, 9:20 PM IST

Updated : May 16, 2022, 9:51 PM IST

Sarkaru Vaari paata movie success event: సూపర్​స్టార్​ మహేశ్‌బాబు నటించిన 'సర్కారు వారి పాట' బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం కర్నూలులో విజయోత్సవ వేడుకను నిర్వహించిన చిత్ర బృందం కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. 'సమ్మర్‌ సెన్సేషనల్‌ బ్లాక్‌ బ్లస్టర్‌' పేరుతో రిలీజ్‌ చేసిన ఈ వీడియోలోని మహేశ్‌బాబు హావభావాలు, సంభాషణలు అభిమానులను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. వెన్నెల కిశోర్‌, కీర్తి సురేశ్‌, సుబ్బరాజు, సముద్రఖనితో మహేశ్‌ చేసిన హంగామా ఇందులో చూడొచ్చు. టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఇక ఈ విజయోత్సపు కార్యక్రమానికి మహేశ్​ బాబుతో సహా టీమ్ మొత్తం హాజరైంది. ఒక్కొక్కరూ చాలా జోష్​తో స్పీచ్​లు ఇచ్చారు. ఇక స్టేజ్​పై డాన్సర్స్ 'మ మ మహేషా' సాంగ్​కి డాన్స్ చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వారితో కలిసి స్టెప్పులేసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత సడెన్​గా మహేశ్​ కూడా స్టేజ్ పైకి వెళ్లారు. తన మాస్ స్టెప్స్​తో ఫ్యాన్స్​ను అలరించారు. మహేశ్​.. ప్రమోషనల్​ ఈవెంట్స్​లో స్టేజ్ ఎక్కి ఇలా డాన్స్ ఎప్పుడూ చేసినట్టు కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

ఇక మహేశ్​ మాట్లాడుతూ.. "ఒక్కడు సినిమా చిత్రీకరణ సమయంలో కర్నూలు వచ్చా. మళ్లీ ఇప్పుడిలా రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్ర విజయోత్సవ వేడుకను ఇక్కడ నిర్వహిస్తున్నామని నిర్మాతలు చెప్పగానే హ్యాపీగా ఫీలయ్యా. ఈ వేడుకకు ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. ఫంక్షన్‌ అంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలి అన్నంతగా ఉంది ఇక్కడి వాతావరణం. మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా చూడగానే మా అబ్బాయి నాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, హగ్‌ చేసుకున్నాడు. 'అన్నింటికంటే నువ్వు ఈ సినిమాలోనే బాగా చేశావు నాన్న' అని మా అమ్మాయి మెచ్చుకుంది. 'పోకిరి, దూకుడు కంటే ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది' అని నాన్న అన్నారు. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడు పరశురామ్‌కే చెందుతుంది. కొవిడ్‌/లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీరందించిన విజయం ముందు అవన్నీ ఇప్పుడు కనిపించట్లేదు. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నిషియన్లు, నిర్మాతలకు ధన్యవాదాలు. కీర్తిసురేశ్‌, సముద్రఖని వల్ల సినిమాకు కొత్తదనం వచ్చింది. తమన్‌ అందించిన ‘కళావతి’ పాట ఆంథెమ్‌లా మారింది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరశురామ్‌, తమన్‌, అనంత శ్రీరామ్‌తోపాటు ఆంధ్రా, సీడెడ్‌, నైజాంకు చెందిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'పుష్ప 2' ఓటీటీ రైట్స్.. ఆ రెండు బడా సంస్థల మధ్య ఫైట్​!

Last Updated : May 16, 2022, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.