ETV Bharat / entertainment

ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె'లో మరో ముగ్గురు స్టార్​ హీరోలు, ఇక ఫ్యాన్స్​కు పండగే - ప్రభాస్​ ప్రాజెక్ట్​ కెలో సూర్య

స్టార్​ హీరో ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' లో అమితాబ్​ బచ్చన్​తో పాటు మరో ముగ్గురు సౌత్​ స్టార్​ హీరోలు నటిస్తున్నారని తెలిసింది. వారెవరంటే.

prabhas project K
ప్రభాస్​ ప్రాజెక్ట్​ కె
author img

By

Published : Sep 2, 2022, 4:09 PM IST

Updated : Sep 2, 2022, 5:19 PM IST

ఇద్దరు స్టార్​ హీరోలు కలిసి మల్టీస్టారర్​ సినిమా చేస్తే అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే ఇప్పటికే పలువురు హీరోలు ఇలాంటి మజాను ఫ్యాన్స్​కు పంచగా.. ఇప్పుడు మరో మల్టీస్టారర్​ రెడీ అవ్వబోతున్నట్లు తెలిసింది. అదేంటంటే..

పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్​లలో నటిస్తున్నారు. అందులో నాగ్​ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ప్రాజెక్ట్​ కె ఒకటి. అయితే ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్​ వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికీ ఈ మూవీలో బాలీవుడ్​ దిగ్గజ నటుడు బిగ్​ బి అమితాబ్​ బచ్చన్​, స్టార్​ హీరోయిన్స్​​ దీపిక పదుకొణె, దిశాపటానీ నటిస్తుండగా.. ఇప్పుడు ఈ చిత్రంలో మరింత మంది బడా స్టార్స్​ కనపడబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు, తమిళ స్టార్​ సూర్య, మలయాళ స్టార్​ దుల్కర్​ సల్మాన్​.. ఈ ముగ్గురు కూడా ఈ భారీ ప్రాజెక్ట్​లో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. గూగుల్​లో కూడా ప్రాజెక్ట్​ కె క్యాస్ట్​​ అని టైప్​ చేస్తే ఈ ముగ్గురు స్టార్​ కథానాయకుల పేర్లు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మూవీటీమ్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాల్సిందే. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పెద్ద పండగనే చెప్పాలి.

ఇదీ చూడండి: పవన్​కల్యాణ్​ అరుదైన ఫొటోలు చూశారా

Last Updated : Sep 2, 2022, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.