Mahesh Babu Pooja Ceremony : సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం జిమ్‌లో కుస్తీ పడుతున్నారు. వరుస వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన మహేశ్.. గుంటూరు కారం చిత్రం షూటింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తాజాగా మహేశ్ బాబు సెంటిమెంట్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసి హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న మహేశ్ బాబు.. ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల్లో నటించారు. ఎన్నో సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేశ్‌కు తన కెరీర్లో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయట. ఈ విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా మహేశ్ తన సినిమాల పూజా కార్యక్రమాలకు హజరుకారు. ఇప్పటి వరకు ఒక్క సినిమా పూజా కార్యక్రమానికి హాజరుకాలేదట. ఈ సెంటిమెంట్‌ను ఆయన తన తొలి సినిమా నుంచే అనుసరిస్తున్నారట. ఆయనకు బదులుగా సతీమణి నమ్రతా శిరోద్కర్ లేదా పిల్లలు గౌతమ్, సితార పూజా కార్యక్రమానికి హాజరవుతారు.
-
#SSMB28 🌟 Pooja commenced today.✨
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Regular shoot starts this April, 2022! 💫
Superstar @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine pic.twitter.com/Cvp6hY8Qss
">#SSMB28 🌟 Pooja commenced today.✨
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2022
Regular shoot starts this April, 2022! 💫
Superstar @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine pic.twitter.com/Cvp6hY8Qss#SSMB28 🌟 Pooja commenced today.✨
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 3, 2022
Regular shoot starts this April, 2022! 💫
Superstar @urstrulyMahesh #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 @haarikahassine pic.twitter.com/Cvp6hY8Qss
అయితే మహేశ్ ఫాలో అవుతున్న ఈ సెంటిమెంట్‌కు కారణం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు మహేశ్. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మహేశ్.
Mahesh Rajamouli Movie Hollywood Actors : అయితే మహేశ్- రాజమౌళి కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. జక్కన్న తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా తాను ఇస్తున్న ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెబుతూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. తాజాగా ఆయన మరో విషయాన్ని చెప్పి.. మహేశ్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. అదేంటో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Mahesh Babu Shahrukh Khan : మహేశ్-షారుక్ ఫన్నీ కన్వర్జేషన్ చదివారా?.. ఇద్దరు కలిసి అలా చేస్తారట!