ETV Bharat / entertainment

వారం గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి ప‌వ‌న్, మ‌హేశ్ బ్లాక్​బస్టర్​​ మూవీలు.. కొత్తవి కాదండోయ్.. - పవన్​ కల్యాణ్ ​ సినిమాలు

వారం గ్యాప్‌లో థియేట‌ర్ల‌లోకి టాలీవుడ్ స్టార్​ హీరోలు ప‌వ‌న్, మ‌హేశ్​​ మూవీలు రానున్నాయి. అయితే అవి కొత్తవి కాదండోయ్​.. వారి బ్లాక్​బస్టర్​ సినిమాలు రీరిలీజ్​ కానున్నాయి. ఆ చిత్రాలు, విడుదలు తేదీల గురించి తెలుసుకుందాం.

mahesh babu okkadu and pavan kalyan kushi movies rerelease dates

author img

By

Published : Dec 19, 2022, 3:37 PM IST

త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌, మ‌హేశ్​ బాబు థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అయితే కొత్త సినిమాల‌తో కాదండోయ్​. వారి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు మ‌రోసారి థియేట‌ర్ల‌లో రీరిలీజ్ కాబోతున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ 'ఖుషి', మ‌హేశ్​ 'ఒక్క‌డు' సినిమాలు వారం రోజుల వ్య‌వ‌ధిలో రీరిలీజ్ కానున్నాయి.

ప‌వ‌న్ కల్యాణ్​ హీరోగా ఎస్‌జే సూర్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'ఖుషి' సినిమా బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. ఈగో స‌మ‌స్య‌ల చుట్టూ అల్లిన ఈ ప్రేమ‌క‌థ‌లో ప‌వ‌న్ యాక్టింగ్, డైలాగ్ డెలివ‌రీ, మేన‌రిజ‌మ్స్ యువ‌త‌రం ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. 2001లో విడుద‌లైన ఈ సినిమా ప‌వ‌న్ ఇమేజ్‌ను రెట్టింపు చేసింది. డిసెంబ‌ర్ 31న 'ఖుషి' రీరిలీజ్ కానుంది. జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ప‌వ‌న్ ఖుషి రీరిలీజైన వారం త‌ర్వాత మ‌హేశ్ 'ఒక్క‌డు' సినిమా కూడా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ సినిమాను జ‌న‌వ‌రి 7న రీరిలీజ్ చేయ‌బోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ల‌వ్​స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'ఖుషి', 'ఒక్క‌డు' సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్‌గా న‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇద్ద‌రు అగ్ర హీరోల సినిమాల వారం వ్య‌వ‌ధిలో రీరిలీజ్ కావ‌డం టాలీవుడ్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.