ETV Bharat / entertainment

సలార్, ఆర్​ఆర్​ఆర్​ రికార్డ్స్ బ్రేక్ - గుంటూరు కారం దెబ్బ అదుర్స్ - ప్రసాద్స్​​ ఐమ్యాక్స్​

Mahesh babu Guntur Kaaram Prasads IMAX : సూపర్ స్టార్​ మహేశ్​ బాబు 'గుంటూరు కారం' విడుదలకు ముందే సరికొత్త రికార్డ్​ను సెట్​ చేసింది. సలార్​, ఆర్​ఆర్​ఆర్​ రికార్డ్స్​ను బ్రేక్ చేసింది.

Guntur Kaaram
Guntur Kaaram
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 10:38 AM IST

Updated : Jan 10, 2024, 11:53 AM IST

Mahesh babu Guntur Kaaram Prasads IMAX : సూపర్ స్టార్​ మహేశ్​ బాబు హీరోగా డైరెక్టర్​ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా 'గుంటూరు కారం'. మరో రెండు రోజుల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చేందుకు రెడీ అవ్వడంతో ఎక్కడ చూసిన ఈ సినిమా సందడే కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. అయితే మహేశ్​ బాబు సినిమా అంటేనే సరికొత్త రికార్డులు నమోదు అవుతుంటాయి! అలాగే ఇప్పుడు గుంటూరు కారం దుమ్ము లేపడం మొదలైంది. ఈ క్రమంలోనే ఓ సరికొత్త ఆల్​టైమ్​ రికార్డ్​ను నమోదు చేసిందీ చిత్రం.

వివరాల్లోకి వెళితే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 90 శాతం స్క్రీన్స్ ఈ గుంటూరు కారం సినిమాకే కేటాయించబోతున్నారు. అయితే హైదరాబాద్​లో మల్టీప్లెక్స్​లో సినిమా అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ప్రసాద్స్ ఐమ్యాక్సే(Prasads Multiplex Guntur Kaaram). ఏ సినిమా విడుదలైన తొలి రోజు పొద్దున్నే థియేటర్ దగ్గర భారీ హడావిడి కనిపిస్తుంటుంది. రివ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్, మీడియా కూడా ఇక్కడికే ఎక్కువగా వస్తుంటారు.

అయితే ప్రసాద్స్​​ ఐమ్యాక్స్​లో 6 స్క్రీన్స్​ ఉండగా - ఈ ఐమ్యాక్స్​లో రోబో 2.0 సినిమా రిలీజ్​ రోజు అత్యధికంగా 34షోలు పడి సరికొత్త రికార్డ్ సెట్​ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును గుంటూరు కారం బ్రేక్ చేసింది. గుంటూరు కారం సినిమా విడుదల రోజు ఏకంగా 41 షోలు వేయనున్నారు. ఈ విషయాన్ని ప్రసాద్స్​ మల్టీప్లెక్స్ అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. అంతకుముందు ప్రసాద్​ ఐమ్యాక్స్​లో రిలీజ్ రోజు సలార్​కు 31, ఆర్​ఆర్​ఆర్​కు 33 షోలు పడ్డాయి. అంటే సలార్​, ఆర్​ఆర్​ఆర్​ రికార్డ్స్​ కూడా బ్రేక్​ అయ్యాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరో సాంగ్ రిలీజ్ : గుంటూరు కారం నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. '‘మావా ఎంతైనా' అనే లిరికల్ సాంగ్‌ను మూవీటీమ్​ నేడు విడుదల చేసింది. ఈ పాటలో మీనాక్షి చౌదరి, మహేశ్​ బాబు సందడి చేశారు. సూపర్ స్టార్ మాస్ స్టెపులేసి అభిమానాలను అలరించారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శ్రీ కృష్ణ, రామాచారి కొమండూరి ఆలపించారు. తమన్ సంగీతం అందించారు.

'ఇకపై మీరే నాకు అమ్మానాన్న'- 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ వేదికపై మహేశ్‌ ఎమోషనల్

ఆ సినిమాల కోసం ఫ్యాన్స్ తెగ వెయిటింగ్​ - ఐఎండీబీ లిస్ట్​లో టాప్​ మూవీస్​ ఇవే

Last Updated : Jan 10, 2024, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.