ETV Bharat / entertainment

మహేశ్ మాస్ జాతర - 'గుంటూరు కారం'ను ఇలా తీర్చిదిద్దారు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 3:18 PM IST

Updated : Jan 11, 2024, 3:24 PM IST

Guntur Kaaram Making video : మహేశ్ బాబు గుంటూరు కారం మేకింగ్ వీడియో రిలీజై సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. వీడియోలోని మహేశ్​ మాస్ జాతరను మీరు చూసేయండి.

మహేశ్ మాస్ జాతర - 'గుంటూరు కారం'ను ఇలా తీర్చిదిద్దారు
మహేశ్ మాస్ జాతర - 'గుంటూరు కారం'ను ఇలా తీర్చిదిద్దారు

Guntur Kaaram Making video : సూపర్ స్టార్​ మహేశ్‌ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన కొత్త చిత్రం 'గుంటూరు కారం'. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ టీమ్​ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మేకింగ్‌ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సినిమా చిత్రీకరణ ఎలా సాగిందో వీడియోలో చూపించింది. దాన్ని మీరూ చూసేయండి..

భారీ సెట్​ : ఈ గుంటూరు కారం సినిమా కోసం ప్రత్యేకంగా ఓ భారీ ఇంటిని సెట్‌లాగా తీర్చిదిద్దడం ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. మహేశ్​ సెట్​లోకి అడుగుపెట్టడం నుంచి ఈ వీడియో ప్రారంభమైంది. ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్​తో కూర్చొని సరదాగా నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈ భారీ సెట్ ఎలా వేశారో చూపించారు. ట్రైలర్​లో మెయిన్​గా చూపించిన ఫైట్ సీక్వెన్స్​లను ఎలా చిత్రీకరించారో ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లు, వీడియోలన్నింటినీ ఇందులో పొందుపరిచారు. సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన శ్రీలీల, మీనాక్షి చౌదరి, సునీల్, ప్రకాశ్ రాజ్ అందరూ సెట్లో సరదాగా ఉన్న క్లిప్పింగ్స్ ఈ మేకింగ్ వీడియోలో జత చేశారు. ఫైనల్​గా త్రివిక్రమ్ యాక్షన్ చెప్పడంతో మొదలయ్యే ఈ మేకింగ్ వీడియో కట్ చెప్పడంతో ముగుస్తుంది.

కాగా, ఈ సంక్రాంతికి అతి పెద్ద సినిమాగా గుంటూరు కారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట షోలతోనే సినిమా హడావుడి ప్రారంభంకానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ల ధరలు కూడా పెరిగాయి. ఏపీలో రూ.50 మేర టికెట్ ధర పెంచడానికి పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీప్లెక్స్​లలో రూ.100 పెంచేందుకు వెసులుబాటు కల్పించారు. ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్​ రూ.135 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మూవీ ఫస్ట్ రివ్యూలు కూడా వచ్చేశాయి. సినిమాలో మాస్ ప్రేక్షకులకు కావాల్సిన మసాలా ఎలిమెంట్స్ ఫుల్​గా ఉన్నాయని చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'హనుమాన్' ఫస్ట్ రివ్యూ - సినిమా గూస్​బంప్స్​!

మహేశ్​ సంక్రాంతి బరిలో ఎన్నిసార్లు హిట్స్ కొట్టారంటే?

Last Updated : Jan 11, 2024, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.