ETV Bharat / entertainment

నిన్న త్రివిక్రమ్​.. ఈ రోజు మహేశ్​.. వీడియో వైరల్​ - త్రివిక్రమ్​ క్రికెట్ వీడియో వైరల్​

రీసెంట్​గా షూటింగ్​ సెట్​లో త్రివిక్రమ్​కు సంబంధించిన ఓ వీడియో వైరల్​ కాగా ఇప్పుడు మహేశ్​బాబుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దాన్ని నెటిజన్లు తెగ షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 3, 2023, 3:50 PM IST

Updated : Feb 3, 2023, 3:57 PM IST

'అల వైకుంఠపురంలో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా 'ఎస్ఎస్ఎంబీ 28'. సూపర్ స్టార్ మహేశ్​ బాబు, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతోంది. ఇందులో యువ కథానాయికగా శ్రీలీల కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీని కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో షూటింగ్​ సెట్​లో దర్శకుడు త్రివిక్రమ్​ క్రికెట్​ ఆడుతున్న వీడియో ఒకటి వైరల్​ అయిన సంగతి తెలిసిందే. షూటింగ్ విరామ సమయంలో సరదాగా ఇతర టీమ్ మెంబర్స్​తో కలిసి ఆడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఇక ఈ వీడియోలో రంగస్థలం మహేశ్​ కూడా చూడొచ్చు.

అయితే ఒక్కరోజు గ్యాప్​లోనే ఇప్పుడు మహేశ్​కు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో మహేశ్​ కూడా ఓ ఫామ్​హౌస్​లో పచ్చని చెట్ల మధ్య ఓ క్రికెట్​ ఆడుతూ కనిపించారు. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తోంది. ఇందులో మహేశ్​ ఓ చిన్న బ్యాట్​తో క్రికెట్ ఆడుతున్నారు. ఇది చూసిన నెటిజన్లు దీన్ని ట్రెండ్ చేస్తూ తెగ లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ssmb 28 విషయానికొస్తే.. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్​-మహేశ్​ కాంబోలో ఎస్​ఎస్​ఎంబీ 28 రావడం వల్ల భారీగా అంచనాలు ఉన్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోని ఈ సినిమాకు అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్​ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్​ రైట్స్​ మొత్తం కలిపి రూ.100కోట్లకు కొనుగోలు అయ్యాయట. ఇక థియేట్రికల్​ బిజినెస్​ దాదాపు రూ.200కోట్ల వరకు జరిగిందని తెలిసింది. దీంతో మొత్తంగా రూ.300కోట్లకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు పోయాయని సమాచారం.

ఇదీ చూడండి: త్రివిక్రమ్.. అర్జున్ దాస్​ను లైన్​లో పెడుతున్నాడా?

Last Updated : Feb 3, 2023, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.