ETV Bharat / entertainment

మ‌హేశ్​తో క‌లిసి మ‌రో సినిమా చేయనున్న స్టార్ డైరెక్ట‌ర్‌? - sarkaaru vari pata

Maheshbabu Anil Ravipudi: 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో దర్శకుడు అనిల్ రావిపూడి.. మహేశ్ బాబుకు సూపర్​హిట్‌ను అందించారు. ప్రిన్స్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఆ చిత్రం నిలిచింది. తాజాగా మహేశ్‌తో మరోసారి పనిచేయాలనుందని అనిల్ తన మనస్సులో మాటను బయటపెట్టారు.

Mahesh Babu And Anil Ravipudi
Mahesh Babu And Anil Ravipudi
author img

By

Published : Apr 29, 2022, 6:41 PM IST

Maheshbabu Anil Ravipudi: సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా అత్యుత్తమ కలెక్షన్లు సాధించి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని మహేశ్ అభిమానులను అలరించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రిన్స్‌ను ఫ్యాన్స్ ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నారో అదే తరహాలో చూపించి సూపర్ సక్సెస్ అందుకున్నారు అనిల్​.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి మహేశ్ బాబు నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఆయన కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మహేశ్ కోసం స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. "మహేశ్ సర్‌తో మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఓకే అంటే ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తే సినిమా ప్రారంభిస్తాను" అని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో తెలిపారు.

Mahesh Babu And Anil Ravipudi
మహేశ్​ బాబు, అనిల్​ రావిపూడి

ప్రస్తుతం మహేశ్.. పరశురామ్ దర్శకత్వంలో నటించిన 'సర్కారు వారి పాట' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

మరోవైపు అనిల్ రావిపూడి.. తెరకెక్కించిన 'ఎఫ్3' సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా వచ్చే నెల 27న విడుదల కానుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో తీసిన ఈ చిత్రం 'ఎఫ్2'కు సీక్వెల్‌గా రానుంది. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ఇది కాకుండా బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నారు అనిల్. బాలయ్యతో చేయబోయే సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఇది విభిన్న జోనర్‌లో ఉండటమే కాకుండా.. సర్‌ప్రైజింగ్ విషయాలు ఎన్నో ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సినీ ప్రియులకు పండగే.. ఆ ఓటీటీలోకి 40 కొత్త వెబ్​సిరీస్​లు,సినిమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.