Madhavan Rocketry movie: కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య, బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ 'రాకెట్రీ' సినిమాలో నటించినందుకు ఒక్క పైసా తీసుకోలేదని మాధవన్ అన్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. స్వీయ దర్శకత్వంలో మాధవన్ ప్రధాన పాత్ర పోషించి, సహ నిర్మాతగా వ్యవహరించిన చిత్రమిది. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ పాన్ ఇండియా చిత్రం జులై 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా మాధవన్ విలేకరులతో ముచ్చటించారు. అతిథి పాత్రలు పోషించిన సూర్య, షారుఖ్ గురించి ఆసక్తికర విశేషాలను తెలిపారు. ఆ సంగతులు మాధవన్ మాటల్లోనే..
అంతా సూర్యదే.. షారుఖ్ గుర్తు చేశారు!
"ఈ చిత్రంలో నటించేందుకు సూర్య, షారుఖ్ ఖాన్ పారితోషకం తీసుకోలేదు. సూర్య తన సహాయకులతో కలిసి సొంత ఖర్చుతోనే ముంబయిలో జరిగిన చిత్రీకరణకు వచ్చారు. ప్రయాణ ఖర్చులు, హిందీ నుంచి తమిళంలోకి సంభాషణలు అనువదించిన వారి రెమ్యునరేషన్ తానే భరించారు. నేను అతిథి పాత్ర పోషించిన షారుఖ్ చిత్రం 'జీరో' సమయంలో 'రాకెట్రీ' కథాలోచన వచ్చింది. నా మనసులో మాట ఆయనతో పంచుకున్నా. కాలం గడిచింది. కొన్నాళ్ల తర్వాత, తన పుట్టినరోజు వేడుకలో ఆ విషయాన్ని గుర్తుచేస్తూ 'మాధవన్.. నేను నీ సినిమాలోని ఓ చిన్న పాత్రలో నటించాలనుకుంటున్నా' అని షారుఖ్ అన్నారు. ఇది జరిగిన రెండు రోజులకు నా భార్య సరిత.. షారుఖ్‌కు థ్యాంక్స్ చెప్పమంది. "నా చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నందుకు షారుఖ్‌కి కృతజ్ఞతలు తెలపండి" అని ఆయన మేనేజరుకు సందేశం పంపా".
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అలా చేయాలనుకోలేదు.. "వెంటనే ఆ మేనేజరు నాకు ఫోన్ చేసి, మీకు డేట్స్ ఎప్పుడు కావాలని షారుఖ్ సర్ అడుగుతున్నారని చెప్పారు. 'నేను గాల్లో మేడలు కట్టాలనుకోవడం లేదు. ఆయన నా సినిమాను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు కాబట్టి షారుఖ్ కోసం ఏదో వచ్చీ పోయే పాత్ర కాదు ప్రాముఖ్యత ఉండేలా తీర్చిదిద్దుతా. తర్వలో ఆ వివరాలు తెలియజేస్తా" అని చెప్పినట్టు మాధవన్ పేర్కొన్నారు.
ప్రచారం మనమే చేసుకోవాలి.. సైన్స్, టెక్నాలజీ నేపథ్యంలో రూపొందిన చిత్రాలకు ప్రభుత్వ మద్దతుంటుందా? అనే ప్రశ్న ఎదురవగా "ఎలాంటి సినిమా అయినా చిత్ర పరిశ్రమే ప్రచారం చేసుకోవాలి" అని మాధవన్ సమాధానమిచ్చారు. "ఇలాంటి చిత్రాల విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలనే దాని గురించి నేను ఆలోచించను. గవర్నమెంట్ తన పని తాను చేయాలి. ఒకవేళ ప్రభుత్వం మద్దతిస్తే అది మరోలా ఉంటుంది. అందుకే మనమే (సినిమా పరిశ్రమ వారు) ఇలాంటి చిత్రాల్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి" అని మాధవన్ తన అభిప్రాయం వెలిబుచ్చారు.
ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి.. కంటెంట్ బావుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటాయని మాధవన్ 'బాహుబలి', 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్', 'కేజీయఫ్' చిత్రాలను ఉద్దేశించి చెప్పారు. సంబంధిత పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఆయా హీరోలు సంవత్సరాలు వెచ్చించడం, తగిన కృషి చేయడం, అర్థవంతమైన కథ.. ఇలా ప్రతి అంశాన్నీ ప్రేక్షకులు చూస్తారని పేర్కొన్నారు. 'రాకెట్రీ'.. సూపర్ హీరో కథని, ఇలాంటి సైంటిస్టులు, ఇంజినీర్లు, ఐటీ స్పెషలిస్టుల విజయగాథలు మరిన్ని తెరపైకి రావాలని మాధవన్ ఆకాంక్షించారు. 'రాకెట్రీ'కి సంబంధించి దక్షిణాది భాషల్లో సూర్య, ఉత్తరాది, ఆంగ్ల భాషల్లో షారుఖ్ కనిపించనున్నారు.
ఇదీ చూడండి: Chor Bazaar: 'బోల్డ్ పాత్రల్లో నటించాలని ఉంది'