Lowest IMDB Rated Bollywood Movie : ఒక సినిమా బాగుందా లేదా అన్న విషయాలను తెలుసుకునేందుకు ఆడియెన్స్ రివ్యూలతో పాటు రేటింగ్స్‌ను చూస్తుంటారు. దాని ద్వారా ఆ సినిమా రిజల్ట్‌ను పరిగణిస్తారు. అయితే చాల మంది సినీ ప్రియులు IMDb ( Internet Movie Database) అనే సంస్థ ఇచ్చే రేటింగ్‌ను ప్రామాణికంగా తీసుకుంటుంటారు. ఎక్కువ IMDb రేటింగ్ ఉంటే అది మంచి సినిమా అని తక్కువ రేటింగ్ ఉంటే బాక్సాఫీస్ వద్ద నిరాశగా మిగిలిన సినిమాగా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు తక్కువ రేటింగ్‌తో ఈ డేటాబేస్‌లో ఎన్నో సినిమాలు నమొదయ్యాయి. మరి అత్యంత తక్కువ రేటింగ్ అందుకున్న సినిమా ఏంటో తెలుసా? అది ఓ బాలీవుడ్ సినిమా.
2008లో విడుదలైన 'దేశ ద్రోహి' చిత్రం బాలీవుడ్ చరిత్రలో అత్యంత తక్కువ IMDb రేటింగ్ గల చిత్రంగా రికార్డుకెక్కింది. జగదీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్(KRK) లీడ్ రోల్లో కనిపించారు. రాజ్ యాదవ్ అనే పాత్రలో ఆయన నటించారు.
స్టోరీ ఏంటంటే ?
Des Drohi Movie Story : రాజా యాదవ్ అనే వ్యక్తి పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయి వెళ్తాడు. అక్కడ అతడికి సోనియా పాటిల్ అనే మహిళతో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త కొద్ది రోజులకే ప్రేమగా మారుతుంది. అయితే ఆమె బాబా కదమ్ అనే డ్రగ్ డీలర్ వద్ద పని చేస్తుంటుంది. కదమ్‌కు రాజన్ నాయక్ అనే శత్రువు ఉంటాడు. ఒకరోజు అతడు బాబా కదమ్‌పై దాడికి పాల్పడగా అందులో సోనియా ఇరుక్కుంటుంది. దీంతో అక్కడి నుంచి సోనియాను కాపాడేందుకు రాజా పోరాడుతాడు. ఆఖరికి ఆమెను రక్షిస్తాడు.
అయితే ఆ తర్వాత ఓ మంత్రి వద్దకు వెళ్లి తనకు సహాయం చేయమని కోరుతాడు రాజా. ఈ నేపథ్యంలో మరో విలన్ అయిన రాజన్ నాయక్‌కు టార్గెట్‌గా మారుతాడు. దీంతో తనకు, సోనియాకు సహాయం చేయడానికి ఎవరూ లేరనే విషయాన్ని తెలుసుకున్న రాజా పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా స్టోరీ. అయితే ఈ సినిమాలోనీ ఏ ఒక్క అంశం కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఐఎండీబీ ఈ చిత్రానికి 1.2 రేటింగ్ ఇచ్చింది. ఇది ఇప్పటి వరకు బాలీవుడ్లో నమోదైన అత్యల్ప రేటింగ్ చిత్రంగా చరిత్రకెక్కింది. మరోవైపు 'దేశ ద్రోహి'తో పాటు లోయెస్ట్ రేటెడ్ బాలీవుడ్ మూవీస్‌లో 'రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్' (1.4), 'హమ్‌షాకల్స్', 'హిమ్మత్‌వాలా'(1.7), 'రేస్ 3' (1.9) సినిమాలు ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సౌత్‌లో రికార్డు సృష్టించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఏదంటే?
3ఇడియట్స్, దంగల్ కాదు- ఓవర్సీస్లో రూ.100కోట్లు రాబట్టిన ఫస్ట్ ఇండియన్ మూవీ ఏంటో తెలుసా?