ETV Bharat / entertainment

'లైగర్'​ ఓటీటీ మే ఆ గయా... వెండితెరపై 'ది ఘోస్ట్​' - ఓటీటీలో లైగర్​

ఇటీవలే విడుదలైన 'లైగర్'​ ఇప్పుడు ఓటీటీలో రానుంది. మరోవైపు నాగార్జున్ హీరోగా తెరకెక్కిన 'ది ఘోస్ట్'​ సిద్ధమైంది. గోదావరి అందాలను చూపించేందుకు మీ ముందుకు వస్తానంటున్నాడు హీరో కార్తికేయ.. ఈ అప్​కమింగ్​ మూవీ అప్డేట్స్​ ఓ సారి చూసేద్దామా.

liger ott release the ghost pre release event karthikeya upcoming film

author img

By

Published : Sep 22, 2022, 9:10 AM IST

Liger In OTT : విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ 'లైగర్‌'. భారీ అంచనాల మధ్య పాన్‌ ఇండియా స్థాయిలో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెటిజన్లకు డిస్నీ+హాట్‌స్టార్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సెప్టెంబరు 22(గురువారం) నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'లైగర్‌' ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఈ విషయమై ట్రెండ్‌ అవుతున్నా, అధికారికంగా ప్రకటించడం కానీ, ప్రమోషన్స్‌ కానీ, లేవు. చిన్న ట్వీట్‌తో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చి, కాస్త ఆశ్చర్యపరిచింది. అనన్యపాండే కథానాయికగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు.

కర్నూలులో 'ది ఘోస్ట్'​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​..: నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ఘోస్ట్‌'. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. ఈ సినిమా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 25న కర్నూల్‌లోని ఎస్టీబీసీ మైదానంలో విడుదల ముందస్తు వేడుక నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకకు చిత్ర బృందమంతా హాజరు కానున్నట్లు ప్రకటనలో తెలిపారు.

గోదావరి నేపథ్యంలో రానున్న 'బెదురులంక 2012'.. : కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి 'బెదురులంక 2012' అనే టైటిల్‌ ఖరారు చేశారు. బుధవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. "ఒక ఊరు నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథగా ఉంటుంది. ఇందులో బలమైన కథతో పాటు కడుపుబ్బా నవ్వించే వినోదముంది.

దీంట్లో మనసుకు నచ్చినట్లుగా జీవించే కుర్రాడిగా కార్తికేయ కనిపిస్తారు. సమాజానికి నచ్చినట్లు బతకడం సమంజసమా.. మనసుకు నచ్చినట్లు బతకడం సమంజసమా? అన్నది సినిమాలో చూడాలి" అన్నారు. "కామెడీ డ్రామాగా.. గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మణిశర్మ ఐదు అద్భుతమైన పాటలిచ్చారు. ఇందులో ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారు’’ అన్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్‌-షిర్లీ సేతియా అదరగొట్టేశారుగా!

తమన్నా సోయగం.. రెడ్​ డ్రెస్​లో రష్మిక కిల్లర్​ లుక్స్​...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.