Leo OTT Release Date : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి- దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'లియో'. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద రూ. 550 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక థియేటర్లో అలరించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీ విడుదల తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 'లియో' సినిమా స్ట్రీమింగ్ కానుంది. అన్నన్ వరార్ వళీ విడు( అన్న వస్తున్నాడు దారి ఇవ్వండి) అంటూ ఈ సినిమాకు సంబంధించి రెండు రిలీజ్ డేట్స్ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. భారత్‌లో నవంబర్ 24న స్ట్రీమింగ్ కానుండగా... గ్లోబల్ వైడగా మాత్రం నవంబర్ 28న రిలీజ్ అవుతున్నట్లు తెలిపింది. 'లియో' ఓటీటీ హక్కులను దాదాపు 120 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
-
Annan vararu vali vidu💥#Leo is coming to Netflix on 24th Nov in India and 28th Nov Globally in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi. https://t.co/FFH4bSjrNW
— Netflix India (@NetflixIndia) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Annan vararu vali vidu💥#Leo is coming to Netflix on 24th Nov in India and 28th Nov Globally in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi. https://t.co/FFH4bSjrNW
— Netflix India (@NetflixIndia) November 20, 2023Annan vararu vali vidu💥#Leo is coming to Netflix on 24th Nov in India and 28th Nov Globally in Tamil, Telugu, Malayalam, Kannada & Hindi. https://t.co/FFH4bSjrNW
— Netflix India (@NetflixIndia) November 20, 2023
Leo Movie Cast : స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కథానాయికగా త్రిష, కీలక పాత్రల్లో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటించారు. మ్యూజిక్ డైరక్టర్‌గా అనిరుధ్ సంగీతం అందించారు . ఈ సినిమాను 7 స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లతిత్ కుమార్ నిర్మించారు.
Thalapathy 68 Movie: లియో సినిమా విడుదలైన తరవాత వారం నుంచే విజయ్ దళపతి తన తర్వాత ప్రాజెక్టు షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. 'దళపతి 68' అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా షూటింగ్‌ను అక్టోబర్‌లోనే చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను ఏజీఎస్ బ్యానర్లో కల్పాతి అఘోరామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎమోషన్స్ ప్రధానంగా రూపొందుతున్న ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, హీరో ప్రశాంత్, జయరాం, యోగిబాబు, వైభవ్ నటిస్తున్నారు. అయితే వీరితో పాటు సీనియర్ నటీమణులు స్నేహ, లైలా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
-
On this auspicious day #Thalapathy68 @actorvijay Sir's #PadaPoojai video is here#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh@vp_offl @thisisysr @actorprashanth @PDdancing #Mohan #Jayaram @actress_Sneha #Laila @meenakshiioffl @iYogiBabu #AGS25 pic.twitter.com/85ROtXein1
— AGS Entertainment (@Ags_production) October 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">On this auspicious day #Thalapathy68 @actorvijay Sir's #PadaPoojai video is here#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh@vp_offl @thisisysr @actorprashanth @PDdancing #Mohan #Jayaram @actress_Sneha #Laila @meenakshiioffl @iYogiBabu #AGS25 pic.twitter.com/85ROtXein1
— AGS Entertainment (@Ags_production) October 24, 2023On this auspicious day #Thalapathy68 @actorvijay Sir's #PadaPoojai video is here#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh@vp_offl @thisisysr @actorprashanth @PDdancing #Mohan #Jayaram @actress_Sneha #Laila @meenakshiioffl @iYogiBabu #AGS25 pic.twitter.com/85ROtXein1
— AGS Entertainment (@Ags_production) October 24, 2023
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Lokesh Kanagaraj Leo movie : విజయ్ ఫ్యాన్స్ నిరాశ.. మూవీలో లోకేశ్ మార్క్ కనిపించలేదట!
Leo Villain : ఏంటి.. 'లియో'లో విలన్ స్టార్ కొరియోగ్రాఫరా?.. భయపెట్టేశాడుగా!