Leo Boxoffice collections :కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ - దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ 'లియో'. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే పబ్లిక్ టాక్, రివ్యూలతో సంబంధం లేకుండా.. మొదటి రోజు నుంచే కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. నాలుగో రోజు వీకెండ్ కావడం వల్ల 'లియో'.. రెండు, మూడో రోజు కంటే కాస్త ఎక్కవగానే వసూల్ చేసింది. ఈ సినిమాకు తమిళనాడులో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.ఇటు తెలుగు రాష్ట్రాల్లోను అదే జోరును కొనసాగించింది.
కలెక్షన్స్ వివరాల విషయానికొస్తే.. 'లియో' ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇండియా వైడ్‌గా వచ్చిన మూడు, నాలుగో రోజు కలెక్షన్లతో మొత్తంగా రూ. 181 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. నాలుగో రోజు తెలుగు 2డీలో మార్నింగ్ షో ఆక్యూపెన్సీ 36.60శాతం , మ్యాట్నీ షో ఆక్యూపెన్సీ 55.34శాతం, ఫస్ట్ షో ఆక్యూపెన్సీ 52.20శాతం, సెకండ్ షో ఆక్యూపెన్సీ 49.94శాతం నమోదయ్యాయని తెలిసింది.
రోజువారి ఇండియా వైడ్‌గా నెట్ కలెక్షన్లు చూస్తే..
- మొదటి రోజ - రూ. 64.8 కోట్లు
- రెండో రోజు - రూ. 35.25 కోట్లు
- మూడో రోజు -రూ. 39.8 కోట్లు
- నాలుగో రోజు - రూ. 41. 50 కోట్లు
గ్రాస్ వసూళ్ల విషయానికొస్తే.. నాలుగో రోజు రూ.49 కోట్లు వచ్చాయట. తమిళనాడు రూ.28కోట్లు, కేరళ రూ.8కోట్లు, ఏపీ-తెలంగాణ రూ.4కోట్లు, కర్ణాటక రూ.5.00కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.4.00కోట్లు సాధించిందట. మొత్తానికి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 400 కోట్ల మార్క్‌ను అందుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
-
Highest Weekend Worldwide Collection Ever for a TAMIL Film 🔥#Leo Grossed over 405.5 Crores+ in Just 4 Days 🔥#LeoHits400crores 🌊#BlockbusterLeo 💥#LeoIndustryHit 💯 pic.twitter.com/wYH8MKSUMR
— Goldmines Telefilms (@GtTelefilms) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Highest Weekend Worldwide Collection Ever for a TAMIL Film 🔥#Leo Grossed over 405.5 Crores+ in Just 4 Days 🔥#LeoHits400crores 🌊#BlockbusterLeo 💥#LeoIndustryHit 💯 pic.twitter.com/wYH8MKSUMR
— Goldmines Telefilms (@GtTelefilms) October 23, 2023Highest Weekend Worldwide Collection Ever for a TAMIL Film 🔥#Leo Grossed over 405.5 Crores+ in Just 4 Days 🔥#LeoHits400crores 🌊#BlockbusterLeo 💥#LeoIndustryHit 💯 pic.twitter.com/wYH8MKSUMR
— Goldmines Telefilms (@GtTelefilms) October 23, 2023
Tiger Nageswarao Day 3 Collections.. మాస్ మహారాజా హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు'.. అక్టోబర్ 20న విడుదలై మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు కూడా వసూళ్లు బాగానే వచ్చాయి. రెండు రోజుల్లో పది కోట్ల మార్క్‌ను అందుకుంది. అయితే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజుకు వసూళ్లు కాస్త తగ్గాయి. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్లు వరకు షేర్‌ను వసూలు చేయగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 3.97 కోట్లు వరకు కలెక్టు చేసినట్లుగా తెలిసింది. మొత్తంగా మూడు రోజుల్లో కలిపి రూ. 14 కోట్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల అంచనా.
Lokesh Kanagaraj Leo movie : విజయ్ ఫ్యాన్స్ నిరాశ.. మూవీలో లోకేశ్ మార్క్ కనిపించలేదట!