ETV Bharat / entertainment

అశ్రునయనాల మధ్య కళాతపస్వి సతీమణికి అంతిమ వీడ్కోలు - విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత

కళాతపస్వి కె.విశ్వనాథ్​ సతీమణి జయలక్ష్మి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్​లోని పంజాగుట్ట శ్మశానవాటికలో కుమారులిద్దరూ తల్లి జయలక్ష్మికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.

legendary director viswanath wife jayalakshmi last rites completed

author img

By

Published : Feb 27, 2023, 3:16 PM IST

Updated : Feb 27, 2023, 3:31 PM IST

దివంగత దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి అంత్యక్రియలు పూర్తయ్యాయి. హైదరాబాద్​లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో కుమారులిద్దరూ తల్లి జయలక్ష్మికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతకుముందు ఫిల్మ్ నగర్​లోని నివాసానికి పలువురు బంధువులు, కుటుంబసన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై జయలక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించారు. విశ్వానాథ్​ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ మరణించిన 24 రోజులకే ఆయన భార్య జయలక్ష్మి చనిపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

అశ్రునయనాల మధ్య కళాతపస్వి సతీమణికి అంతిమ వీడ్కోలు

ఆదివారం సాయంత్రం విశ్వనాథ్​ సతీమణి కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచినారు. అయితే దర్శకుడు విశ్వనాథ్‌ ఫిబ్రవరి 2న మరణించిన విషయం తెలిసిందే. విశ్వనాథ్‌ చనిపోయిన 24 రోజులకే ఆయన సతీమణి మరణించడంతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

కె.విశ్వనాథ్‌ 20ఏళ్ల వయసులో జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అప్పటికి విశ్వనాథ్‌ జీవితంలో స్థిరపడకపోయినా.. తల్లిదండ్రులు చెప్పడంతో వివాహానికి అంగీకరించారు. సినిమా విషయాల్ని ఆయన ఎప్పుడూ ఇంట్లో చర్చించేవారు కాదట. "నా భార్య నా సినిమాల్ని చూసి అలా ఉన్నాయి.. ఇలా ఉన్నాయని విశ్లేషించదు. బాగుంది అని మాత్రమే చెబుతుంది" అంటూ ఓ సందర్భంలో కళాతపస్వి తన సతీమణి గురించి చెప్పారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతి దేవి. అబ్బాయిలు కె.నాగేంద్రనాథ్‌, కె.రవీంద్రనాథ్‌. చిత్ర పరిశ్రమపై ఆసక్తి లేకపోవడంతో వారికిష్టమైన రంగాల్లో స్థిరపడ్డారు.

ఇదీ చదవండి: కళాతపస్వి ఇంట మరో విషాదం.. విశ్వనాథ్​ సతీమణి కన్నుమూత

Last Updated : Feb 27, 2023, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.