ETV Bharat / entertainment

'చంద్రముఖి-2'లో హీరోయిన్​పై లారెన్స్ క్లారిటీ - చంద్రముఖి 2 హీరోియిన్

రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం 'చంద్రముఖి'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు దర్శకుడు. ఇందులో లారెన్స్​ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే హీరోయిన్​గా ఎవరు చేస్తున్నారన్న విషయమై స్పష్టత లేదు. కానీ కొన్ని పేర్లు మాత్రం మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీటిపై లారెన్స్ స్పష్టతనిచ్చారు.

చంద్రముఖి 2 హీరోియిన్
'చంద్రముఖి-2'లో హీరోయిన్​పై లారెన్స్ క్లారిటీ
author img

By

Published : Aug 2, 2020, 12:06 PM IST

Updated : Dec 16, 2022, 10:56 AM IST

రజనీకాంత్‌ కథానాయకుడిగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం 'చంద్రముఖి'. రజనీకాంత్‌, జ్యోతిక నటన, ఉత్కంఠ కలిగించే కథనం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో ఉన్నారు దర్శకుడు పి.వాసు. రజనీతో పాటు, ఈసారి కొత్త కథలో దర్శకుడు, నటుడు లారెన్స్‌ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే, చంద్రముఖిగా ఎవరు నటిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ విషయమై జ్యోతికను అడగ్గా.. సీక్వెల్‌ కోసం తననెవరూ సంప్రదించలేదని తెలిపారు. అంతేకాదు, సిమ్రన్‌, కియారా అడ్వాణీ పేర్లు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై నటుడు లారెన్స్‌ స్పష్టత ఇచ్చారు.

"మీడియా మిత్రులకు.. చంద్రముఖి-2లో కథానాయిక పాత్ర గురించి అనేక వదంతులు వస్తున్నాయి. జ్యోతిక మేడమ్‌, సిమ్రన్‌ మేడమ్‌, కియారా అడ్వాణీలు కీలక పాత్రలో నటిస్తారని వార్తలు రాస్తున్నారు. అదంతా ఫేక్‌ న్యూస్‌. ప్రస్తుతం ఇంకా స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. కొవిడ్‌ పరిస్థితులు చక్కబడితే చిత్రబృందమే ఆ వివరాలు వెల్లడిస్తుంది. మేమే అధికారికంగా చెబుతాం. ధన్యవాదాలు’" అని ట్వీట్‌ చేశారు.

లారెన్స్‌ ట్వీట్‌తో 'చంద్రముఖి' ఫిమేల్‌ లీడ్‌ క్యారెక్టర్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. మరి ఆ పాత్ర ఎవరిని వరిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే

Last Updated : Dec 16, 2022, 10:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.