ETV Bharat / entertainment

'లాల్​ సలామ్'​ పోస్టర్​ రిలీజ్​.. రజినీకాంత్​ చెల్లెలుగా జీవిత రాజశేఖర్​..! - lal salaam vishnu vishal

సూపర్​ స్టార్​ రజినీకాంత్ తనయ ఐశ్వర్య​ దర్శకత్వంలో వస్తున్న తమిళ సినిమా లాల్​ సలామ్​ మూవీ షూటింగ్​ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. దీనికి సంబంధించి కొత్త పోస్టర్​ను ట్విట్టర్​లో రిలీజ్​ చేశారు మూవీ మేకర్స్​​.

Lal Salam New Movie Poster Release
లాల్​ సలామ్​ మూవీ పోస్టర్​ రిలీజ్​
author img

By

Published : Mar 7, 2023, 6:42 PM IST

సూపర్​ స్టార్​ రజినీకాంత్ తనయ ఐశ్వర్య​ దర్శకత్వంలో రూపొందనున్న తమిళ సినిమా 'లాల్​ సలామ్'. ఈ చిత్ర​ షూటింగ్​ మంగళవారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పోస్టర్​ను ట్విట్టర్​ వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. విష్ణు విశాల్, విక్రాంత్ నటిస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాదే విడుదల కానుంది. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్​ అవార్డ్​ గ్రహీత ఏఆర్​ రెహ్మాన్​ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను గతేడాది నవంబరులో ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు రెహ్మాన్​. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్​.

ఇకపోతే ఈ సినిమాలో తలైవా రజినీకాంత్​ కూడా ఓ అతిథి పాత్రను పోషించనున్నారట. సూపర్​స్టార్ రజినీకాంత్​​ ప్రస్తుతం నెల్సన్​ దిలీప్​కుమార్​ డైరెక్షన్​లో రూపొందుతున్న 'జైలర్'​ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ చిత్రీకరణ తర్వాతే తలైవా 'లాల్​ సలామ్' షూటింగ్​కు సమయం కేటాయించనున్నారట. కొత్త పోస్టర్‌లో తెల్లటి యూనిఫారంలో ఉన్న పురుషుల గుంపు బ్యాక్​గ్రౌండ్​లో ఉన్న మంటల్లో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే సినిమా కథాంశమేంటో పూర్తిగా తెలియనప్పటికీ.. క్రికెట్​ ఆధారంగానే ఈ 'లాల్​ సలామ్'​ సినిమా ఉంటుందని సమాచారం. అయితే మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ వారం రోజుల పాటు జరగనుందని సమాచారం. ప్రస్తుతం తమిళనాడులో​ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో జరుగుతోంది. 'లాల్​ సలామ్'​లో నటిస్తున్న కొందరు నటీనటులు కూడా ఈ లీగ్​లో ఆడుతున్నారు. వారు ఈ మ్యాచ్​లు ఆడటానికి వీలుగా వారాంతంలో షూటింగ్​ను పక్కన పెట్టనున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ ఫ్యాక్ట్ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జీవిత రాజశేఖర్​ ఇందులో రజనీకాంత్​ సోదరి పాత్రలో నటించనున్నారని ఇండస్ట్రీలో టాక్​ వినిపిస్తోంది. ఇదే నిజమైతే సుదీర్ఘ కాలం తర్వాత జీవిత రాజశేఖర్​ మళ్లీ నటిగా స్క్రీన్​ ముందుకు రానున్నారు.

మరోవైపు ఏడేళ్ల విరామం తర్వాత 'లాల్​ సలామ్'​తో తిరిగి మెగాఫోన్ పట్టనున్నారు ఐశ్వర్య. కొరియెగ్రాఫర్ల జీవిత ప్రయాణాన్ని చూపిస్తూ ఈమె 'సినిమా వీరన్'​ అనే పేరుతో ఓ డాక్యుమెంటరిని డైరెక్ట్​ చేశారు. ఆమె మాజీ భర్త, హీరో ధనుష్​, వై రాజా వైలు కలిసి నటించిన '3', బ్లాక్​ బస్టర్​ సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.