ETV Bharat / entertainment

మెలోడియస్​గా 'ఖుషి' సెకెండ్​ సింగిల్.. సామ్​-విజయ్​ కెమిస్ట్రీ​ అదుర్స్​ - ఖుషి మూవీ సాంగ్స్​

aradhya song kushi : సమంత, విజయ్ దేవరకొండ లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న ఖుషి నుంచి ఆరాధ్య అనే సెకెండ్​ సింగిల్​ రిలీజైంది. యూట్యూబ్​లో సెన్సేషన్​ క్రియేట్​ చేస్తున్న ఈ పాటను మీరు కూడా ఓ సారి చూసేయండి..​

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 12, 2023, 5:50 PM IST

Updated : Jul 12, 2023, 6:47 PM IST

Kushi Second Single Song : రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఖుషి' నుంచి మరో సాంగ్​ రిలీజై సోషల్​ మీడియాలో సెన్సేషన్​ సృష్టిస్తోంది. 'ఆరాధ్య' అంటూ సాగే ఈ సాంగ్..​ మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, సమంతకు పెళ్లి జరిగే సన్నివేశంతో మొదలైన ఈ పాట.. ఆ తర్వాత వారిద్దరి వైవాహిక జీవితంలో కొన్ని సంఘటనలను చూపిస్తూ సాగుతుంది. 'ఒకవేళ అందమైన పెళ్లి జీవితం ఓ మెలోడీ అయితే?' అంటూ మూవీ మేకర్స్​ ఈ పాటను విడుదల చేశారు. హేషామ్​ అబ్దుల్ వాహెబ్ స్వరపరిచిన ఈ పాటకు సినిమా దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించగా.. సిద్ శ్రీరామ్ - చిన్మయి ఈ చక్కటి సాంగ్​ను ఆలపించారు.

Kushi Movie Songs : అయితే ఈ పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ హైలైట్​గా ఉందని అభిమానులు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే వచ్చిన 'నా రోజా నువ్వే' సాంగ్​.. రిలీజైన అన్నీ భాషల్లోనూ శ్రోతలను ఆకట్టుకోగా.. ఇప్పుడు 'ఆరాధ్య' కూడా మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటను హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ చిత్ర యూనిట్​ రిలీజ్ చేసింది. ఆయా భాషలను బట్టి గాయకులు, పాట రచయితలు వేర్వేరుగా ఉన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kushi Movie Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. సమంత, విజయ్​ లీడ్​ రోల్స్​లో నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు జయరామ్, 'వెన్నెల' కిశోర్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం 'ఖుషి' సినిమా స్టార్​.. షూటింగ్​ కంప్లీట్​ చేసే పనుల్లో ఉన్నారు. వరుస షెడ్యూళ్లతో శరవేగంగా షూటింగ్​ కంప్లీట్​ చేసుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం తన లాస్ట్​ షెడ్యూల్​లో ఉంది. వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా..తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న గ్రాండ్​గా విడుదల కానుంది.

Last Updated : Jul 12, 2023, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.