ETV Bharat / entertainment

గుండెల్ని పిండేసే 'ఖుషి' క్లైమాక్స్​.. ఫ్యాన్స్​ రెస్పాన్స్​ ఎలా ఉంటుందో? - ఖుషి నా రోజా నువ్వే పాట

అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఖుషి'. హీరో విజయ్​ దేవకొండ, సమంత వస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా కోసం ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ పాట విడుదలై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా క్లైమాక్స్​ గుండెల్ని పిండేసేలా ఉంటుందట. ఆ వివరాలు..

khushi climax
khushi climax
author img

By

Published : May 14, 2023, 8:31 PM IST

Updated : May 14, 2023, 9:02 PM IST

టాలీవుడ్​ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్​ హీరోయిన్ సమంత నటిస్తున్న కొత్త చిత్రం 'ఖుషి'. 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేం దర్శకుడు శివ‌ నిర్వాణ.. ఈ చిత్రాన్ని డైరెక్ట్​ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ బర్త్​డే సందర్భంగా ఈ సినిమాలోని మొదటి​ పాటను​ విడుదల​ చేశారు మేకర్స్. 'నా రోజా నువ్వే..' అంటూ సాగే ఈ పాట మ్యూజిక్​ లవర్స్​ను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేశారు. ఇందులో సమంతతో పాటు విజయ్​ న్యూ లుక్స్​తో అదిరిపోయారంటూ ఫ్యాన్స్​ సంబరపడిపోతున్నారు. ఈ పాటను ఓ క్రేజీ కాన్సెప్ట్​తో రాశారు. ఈ పాట లిరిక్స్​.. మణిరత్నం తీసిన సినిమా పేర్లతో సాగుతాయి. దీంతో 'నా రోజా నువ్వే..' సాంగ్​ను తెగ ఎంజాయ్​ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే, తాజాగా ఈ సినిమా క్లైమాక్స్​కు సంబంధించి మరో వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

ఈ సినిమాలో సమంత ఓ ముస్లిం యువతిగా కనిపిస్తోంది. విజయ్, ఈ ముస్లిం యువతి మధ్య జరిగిన ప్రేమ కథే ఈ సినిమా అని టాక్​. అయితే, ఖుషి క్లైమాక్స్​పై రకరకాల ఊహాగానాలు వినబడుతున్నాయి. హీరో, హీరోయిన్ ఇద్దరిలో ఒకరు చనిపోతారట. ఈ సినిమా క్లైమాక్స్​ గుండెను హత్తుకునేలా ఉంటుందని తెలుస్తోంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు.. అందుకోసం జీవించినంత కాలం ఆనందంగా జీవించాలనే మెసేజ్​తో ఈ సినిమా ముగుస్తుందని చర్చ​ జరుగుతోంది. అయితే, సినిమా దాదాపు మొత్తం ఫ్లాష్​బ్యాక్​ మోడ్​లో ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమా రెండు నెలల ముందే విడుదల కావాల్సింది. కానీ సమంత అనారోగ్య సమస్యల కారణంగా చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ కారణంగా ఖుషి రిలీజ్‌ను సెప్టెంబర్‌కు పోస్ట్‌ పోన్‌ చేశారు మేకర్స్​. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ మూవీకి మాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్​ హేషామ్ అబ్దుల్ వాహాబ్ స్వరాలు సమకూరుస్తున్నారు. మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, జయరామ్, మురళీ శర్మ, అలీ, లక్ష్మీ, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, శరణ్య ప్రదీప్ శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Last Updated : May 14, 2023, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.