ETV Bharat / entertainment

నాగచైతన్య- కృతిశెట్టి కొత్త మూవీ లాంచ్​.. గెస్టు​లుగా శివ కార్తికేయన్​, రానా - కృతిశెట్టితో మరోసారి నాగచైతన్య

Nagachaitanya-Kritishetty: 'బంగార్రాజు' సినిమాతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న జోడీ నాగచైతన్య-కృతిశెట్టి. వీరిద్దరు కలిసి మరోసారి రొమాన్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఏ చిత్రంలో అంటే?

Nagachaitanya-Kritishetty
కృతిశెట్టి-నాగచైతన్య కొత్త మూవీ లాంచ్
author img

By

Published : Jun 23, 2022, 10:40 AM IST

Updated : Jun 23, 2022, 2:21 PM IST

Nagachaitanya-Kritishetty: టాలీవుడ్​లో క్యూట్​ కపుల్​ అనగానే గుర్తొచ్చేది నాగచైతన్య- సమంత. కానీ వీరిద్దరూ గతేడాది విడాకులు తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే 'లవ్​స్టోరీ', 'బంగార్రాజు'తో ఫామ్​లో ఉన్న చైతూ.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేయనున్నారని వార్తలొచ్చాయి. అయితే ఇటీవలే 'ఎన్​వీ22' పేరుతో దీన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకను జరుపుకుంది. హీరోయిన్​గా కృతిశెట్టిని ఎంపిక చేసినట్లు తెలిపారు మేకర్స్​. దీంతో పాటే లెజెండరీ మ్యూజిక్​ డైరెక్టర్​ ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బోయపాటి క్లాప్​ కొట్టారు. ఈ కార్యక్రమంలో విలక్షణ నటుడు రానా, తమిళ హీరో శివకార్తికేయన్​ సందడి చేశారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రవీణ్ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పటికే చైతూ-కృతిశెట్టి.. నాగార్జున నటించిన 'బంగార్రాజు' సినిమాలో జంటగా నటించారు. ఇందులో వీరి కెమిస్ట్రీ తెలుగు ప్రేక్ష‌కుల్ని బాగా ఆకట్టుకుంది.

Nagachaitanya-Kritishetty
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్​ కొట్టిన బోయపాటి
Nagachaitanya-Kritishetty
శివకార్తికేయన్​, రానా

కాగా, చైతూ నటించిన 'లాల్​సింగ్​ చద్ధా', 'థ్యాంక్యూ' సినిమాలకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కృతిశెట్టి.. త్వరలోనే 'ది వారియర్'​, 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లో నటిస్తోంది.

Nagachaitanya-Kritishetty
శివకార్తికేయన్​, రానా

ఇదీ చూడండి: ఆ దర్శకుడికి క్షమాపణలు చెప్పిన రామ్​.. ఎందుకంటే?

Last Updated : Jun 23, 2022, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.