ETV Bharat / entertainment

ఎన్టీఆర్​ను అలా చూడటమంటే కృష్ణంరాజుకు చాలా ఇష్టమట - krishnam raju death

సీనియర్​ నటుడు కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో నేడు కన్నుమూశారు. ఆయన మృతితో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో మిగతా నటులతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడిన మాటలను ఓ సారి గుర్తుచేసుకుందాం..

krishnam raju
కృష్ణంరాజు
author img

By

Published : Sep 11, 2022, 1:36 PM IST

టాలీవుడ్​లో 50 ఏళ్లకుపైగా హీరోగా, విలన్​గా అటు దిగ్గజ నటులతో ఇటు యువ నటులతో స్క్రీన్​ షేర్​ చేసుకున్న సీనియర్​ నటుడు కృష్ణంరాజు నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో ఎన్టీఆర్​, ఏఎన్​ఆర్​తో పాటు మిగతా నటులతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడిన మాటలను ఓ సారి గుర్తుచేసుకుందాం..

ఎన్టీఆర్​ను అలా చూడటం చాలా ఇష్టమట.. ఎన్టీఆర్​ను శ్రీ‌కృష్ణునిగా తెర‌పై చూడ‌డమంటే కృష్ణంరాజుకు ఎంతోఇష్టమట. కృష్ణంరాజు తొలిసారి ఎన్టీఆర్​ను కృష్ణుని గెట‌ప్​లోనే కలుసుకున్నారట. 'శ్రీకృష్ణతులాభారం' చిత్రంలో ఎన్టీఆర్​ శ్రీ‌కృష్ణును వేషంలో ఉండ‌గా ఆయ‌న‌ను తొలిసారి క‌లుసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఎన్టీఆర్​ త‌న‌పై చూపిన ఆప్యాయ‌త‌ను ఎన్న‌టికీ మ‌ర‌చిపోలేన‌ని చెప్పేవారు కృష్ణంరాజు. ఎన్టీఆర్​.. కృష్ణంరాజుకు త‌న చిత్రాల‌లో ఏవైనా పాత్రలు ఉంటే ఇప్పించేవారు. అలా ఎన్టీఆర్​తో క‌లిసి కృష్ణంరాజు భ‌లే మాస్ట‌ర్, బ‌డిపంతులు, మ‌నుషుల్లో దేవుడు, మంచికి మ‌రోపేరు, ప‌ల్లెటూరి చిన్నోడు, వాడే-వీడు, స‌తీసావిత్రి చిత్రాల‌లో న‌టించారు. ఎన్టీఆర్​ తర్వాత కొన్ని పాత్ర‌ల‌కు కృష్ణంరాజు మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌ర‌ని అప్ప‌టి ర‌చ‌యితలు, ద‌ర్శ‌కులు భావించేవారు. అలా రూపొందిన 'బొబ్బిలి బ్ర‌హ్మ‌న్న‌' చిత్రంతో కృష్ణంరాజు జేజేలు అందుకున్నారు. తాండ్ర పాపారాయుడు, శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు వంటి పాత్ర‌ల్లోనూ న‌టించి అల‌రించారు.

Krishnam raju relation with NTR ANR
ఎన్టీఆర్​ కృష్ణంరాజు

అక్కినేనితో బంధం.. ఏయ‌న్నార్ న‌టించిన 'దేవ‌దాసు' చిత్ర‌మంటే కృష్ణంరాజుకు ఎంతో ఇష్టం. ఆ సినిమాను ప‌లుమార్లు చూశాన‌ని కృష్ణంరాజు చెప్పేవారు. వీరిద్దరు కలిసి బుద్ధిమంతుడు, జై జ‌వాన్, ప‌విత్ర‌బంధం, రైతుకుటుంబం, మంచిరోజులు వ‌చ్చాయి, క‌న్న‌కొడుకు, య‌స్.పి.భ‌యంక‌ర్ మొద‌లైన చిత్రాల‌లో న‌టించారు.

కృష్ణ‌- కృష్ణంరాజు.. వీరిద్దరూ దాదాపుగా ఒకే స‌మ‌యంలో చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టారు. కృష్ణకు ఆరంభంలోనే హీరోగా అవ‌కాశాలు వచ్చాయి. అయితే ఇద్ద‌రూ ప‌లు చిత్రాల‌లో పోటీ ప‌డి న‌టించారు. కృష్ణ న‌టించిన అనేక చిత్రాల‌లో కృష్ణంరాజు విల‌న్​గా మెప్పించారు. తర్వాత ఇద్ద‌రూ క‌ల‌సి హీరోలుగానూ న‌టించారు. నేనంటే నేనే, మ‌ళ్ళీ పెళ్ళి, అమ్మ‌కోసం, పెళ్ళిసంబంధం, అల్లుడే మేన‌ల్లుడు, అనురాధ‌, రాజ్ మ‌హ‌ల్, అంతా మ‌న‌మంచికే, హంతకులు- దేవాంత‌కులు, భ‌లే మోస‌గాడు, ఇన్ స్పెక్ట‌ర్ భార్య‌, ఇల్లు ఇల్లాలు, త‌ల్లీకొడుకులు, శ్రీ‌వారు-మావారు, మ‌మ‌త‌, మాయ‌దారి మ‌ల్లిగాడు, స్నేహ‌బంధం, కురుక్షేత్రం, మ‌నుషులు చేసిన దొంగ‌లు, అడ‌వి సింహాలు, యుద్ధం, విశ్వ‌నాథ‌నాయ‌కుడు, ఇంద్ర‌భ‌వ‌నం, సుల్తాన్ వంటి చిత్రాల‌లో న‌టించారు.

శోభ‌న్ బాబుతో.. శోభ‌న్ బాబు, కృష్ణంరాజు మ‌ధ్య మంచి స్నేహం ఉండేది. ఒక‌రి ఇంటి విష‌యాలు, మ‌రొక‌రు చెప్పుకొని ముచ్చ‌టించుకొనేంత స్నేహం త‌మ మ‌ధ్య ఉండేద‌ని కృష్ణంరాజు పలు సందర్భాల్లో చెప్పేవారు. శోభ‌న్ బాబు మ‌ద్రాసులో సొంత ఇల్లు క‌ట్టించుకొనే స‌మ‌యంలో కృష్ణంరాజుకు తెలిసిన కాంట్రాక్ట‌ర్ తోనే నిర్మాణం సాగింద‌ట‌! వీరిద్ద‌రూ 'బంగారుత‌ల్లి, రామ‌బాణం' వంటిచిత్రాల‌లో అన్న‌ద‌మ్ములుగానే న‌టించారు. మాన‌వుడు – దాన‌వుడు, జీవ‌న‌త‌రంగాలు, జీవితం, ఇద్ద‌రూ ఇద్ద‌రే, కురుక్షేత్రం చిత్రాల్లోనూ నటించారు.

చిరంజీవితో.. చిరు- కృష్ణంరాజు ఒకే ప్రాంతానికి చెందినవారు. వీరిద్దరు కలిసి నటించారు. చిరంజీవి.. కృష్ణంరాజును 'అన్న‌య్యా' అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. చిరు స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున రాజ‌మండ్రి నుంటి కృష్ణంరాజు పార్ల‌మెంట్​కు పోటీ కూడాచేశారు. వారిద్ద‌రూ క‌ల‌సి న‌టించిన ప్రేమ‌త‌రంగాలు, పులి-బెబ్బులి అభిమానుల్ని బాగా అలరించాయి.

Krishnam raju relation with NTR ANR
చిరంజీవి

బాల‌కృష్ణ‌తోనూ కృష్ణంరాజుకు మంచి అనుబంధం ఉంది. బాల‌కృష్ణతో ఆయ‌న "సుల్తాన్, వంశోద్ధార‌కుడు"వంటి చిత్రాల‌లో న‌టించారు. నాగార్జునకు హీరోగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన 'కిరాయిదాదా'లో కృష్ణంరాజు కీల‌క పాత్ర పోషించారు. 'నేటి సిద్ధార్థ‌'లోనూ క‌లిసి న‌టించారు. వెంక‌టేశ్ హీరోగా రూపొందిన 'టూ టౌన్ రౌడీ'లో రంజిత్ కుమార్ పాత్ర‌లో న‌టించి అల‌రించారు కృష్ణంరాజు. సుమ‌న్​కు ఆయ‌న బావ‌గా న‌టించిన 'బావ‌-బావ‌మ‌రిది' బంప‌ర్ హిట్ అయింది. అలా జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్, ఉద‌య్ కిర‌ణ్ వంటివారితోనూ కృష్ణంరాజు క‌ల‌సి న‌టించారు. ఇక తన నట వారసుడైన ప్ర‌భాస్​తో కూడా క‌ల‌సి బిల్లా, రెబ‌ల్, రాధేశ్యామ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు.

ఇదీ చూడండి: 'RRRలో ఆ హీరోకే ఎక్కువ న్యాయం!'.. ఎట్టకేలకు నోరు విప్పిన రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.