ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు వంటి విషయాలు కాస్త ఎక్కువగానే వింటుంటాం. అయితే ఇప్పటికే చై-సామ్, ధనుష్-ఐశ్వర్యల విడాకుల అంశం హాట్‌టాపిక్‌గానే ఉండగానే.. తాజాగా మరో కోలీవుడ్ జంట డివర్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హీరో విజయ్ ఆంటోనీ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
విజయ్ చేసిన ట్వీట్ ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. 'కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే మీరే పరిష్కరించుకోండి. కానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకండి' అని ట్వీట్ చేశాడు. సాధారణంగా తన సినిమాల గురించి తప్పా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని విజయ్ ఇలాంటి కామెంట్స్ చేయడంపై ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
తన భార్యతో విబేధాల కారణంగానే విజయ్ ఈ పోస్ట్ చేశాడా? త్వరలోనే వీరు కూడా విడాకుల ప్రకటన చేస్తారేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, 2006లో విజయ్, ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. ఆమె సినీ నిర్మాత. వీరికి లారా అనే కూతురు ఉంది.
ఇదీ చూడండి: బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ పెళ్లి!.. ఎప్పుడు చేసుకోబోతుందంటే?