ETV Bharat / entertainment

టీజర్​తో అదరగొట్టేసిన కిరణ్​ అబ్బవరం.. ఫన్నీగా 'మై డియర్ భూతం' ట్రైలర్​ - my dear bhootam trailer

యువ నటుడు కిరణ్‌ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సిన' టీజర్​, ప్రముఖ కొరియోగ్రాఫర్​, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న 'మై డియర్ భూతం' ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూసేద్దాం...

Kiran abbavaram Nenu meeku baga kavalsina vadini
నేను మీకు బాగా కావాల్సినవాడిని
author img

By

Published : Jul 10, 2022, 12:50 PM IST

Updated : Jul 10, 2022, 1:33 PM IST

Kiranabbavaram Nenu meeku baga kavalsina vadini: యువ నటుడు కిరణ్‌ అబ్బవరం నటించిన సరికొత్త ఎంటర్‌టైనర్‌ 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని'. శ్రీధర్‌ గాదే దర్శకుడు. యూత్‌ఫుల్‌, ఫ్యామిలీ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. "అంత ఆహ్లాదకరమైన కుటుంబం మీకు ఉన్నప్పుడు అందరూ కలిసి సరదాగా ఉగాది పచ్చడి తినకుండా ఇంతదూరం వచ్చి ఇంతలా ఎందుకు తాగుతున్నారు", "ఒక్క ప్రేమకే మీరిలా అయిపోతే ఎలా మేడమ్‌. పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే.. సిగ్గులేకుండా పదకొండోసారి ప్రేమ కోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం‌" అంటూ కిరణ్‌ అబ్బవరం చెప్పే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక, బాబా భాస్కర్‌, కిరణ్‌ అబ్బవరం మధ్య వచ్చే సన్నివేశాలు, పంచ్‌ డైలాగ్‌లు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. టీజర్ చివర్లో.. "మామ కాబోయే అల్లుడితో జోకులు వేయమాక. రేపు సంక్రాంతి పండక్కి నువ్వు, నేనే ఇంట్లో కూర్చొని వడలు తినాల్సింది" అంటూ సాగే సంభాషణలు, ఫైట్‌ సీక్వెన్స్‌లు అలరిస్తున్నాయి. ఇందులో కిరణ్‌కు జోడీగా సంజనా ఆనంద్‌, సోనూ ఠాకూర్‌ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరమే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Prabhudeva new movie trailer: ప్రముఖ కొరియోగ్రాఫర్​, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న మరో ప్రయోగాత్మక సినిమా 'మై డియర్ భూతం' చిత్రంలో నటిస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ మూవీని సినిమాను నిర్మిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో ప్రభుదేవాతోపాటు రమ్యా నంబీశన్, అశ్వత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: రామానాయుడు స్టూడియోలో ఆ ఫ్లోర్​ 'కోట'దేనట..

Last Updated : Jul 10, 2022, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.