ETV Bharat / entertainment

'సలార్‌'లో రాకీభాయ్‌.. ఐదు భాగాలుగా 'కేజీఎఫ్‌'.. మూడో పార్ట్​లో యశ్​ ఉంటారా? - సలార్​ మూవీ లేటెస్ట్ న్యూస్

ఆ సినిమా ఓ చరిత్రను సృష్టించింది. అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసేలా చేసింది. అదే రాకీభాయ్​ యశ్​ నటించిన కేజీఎఫ్​. ఇప్పటికే రిలీజైన రెండు భాగాలకు ప్రేక్షకులు కనెక్టవ్వగా రీసెంట్​గా ఈ సినిమా గురించి హోంబాలే ఫిల్మ్స్‌ ఓ అదిరిపోయే న్యూస్‌ చెప్పింది.

yash to act in prabhas salaar
yash to act in prabhas salaar
author img

By

Published : Jan 24, 2023, 6:18 PM IST

కేజీఎఫ్​.. రెండు భాగాలుగా రిలీజైన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో రాకింగ్​ స్టార్​ యశ్‌ పేరు ఒక బ్రాండ్‌లాగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రూ.1250కోట్లు వసూళ్లు చేసింది. అయితే తాజాగా కేజీయఫ్‌ అభిమానులకు హోంబాలే ఫిల్మ్స్‌ నిర్వాహకులు ఓ అదిరిపోయే న్యూస్‌ చెప్పారు. అదేంటంటే ఇప్పటికే రెండు పార్టులు రిలీజైన 'కేజీఎఫ్‌' సినిమా ఇప్పుడు మొత్తం ఐదు భాగాల్లో తీస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఒక్కో సీక్వెల్లో ఒక్కో హీరో ఉండనున్నట్లు తెలిపారు. దీంతో 2025లో ప్రారంభం కానున్న 'కేజీఎఫ్‌3'లో యశ్‌ కనిపిస్తారా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ సిరీస్​లోనూ యశ్​ ఉంటే బాగున్ను అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీయఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న 'సలార్'కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్​ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్​తో పాటు రాకీభాయ్​ యశ్‌ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారనే టాక్‌ నడుస్తోంది. దీని కోసం ప్రశాంత్‌నీల్‌ కేజీయఫ్‌ స్టార్‌ యశ్‌ను సంప్రదించారని.. యశ్‌ ఓకే చేశారని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ, ఈ ఇద్దరు పాన్‌ ఇండియా హీరోలు ఒకే సినిమాలో మెరవనున్నారన్న వార్తను మాత్రం అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ఇది మాత్రం నిజమైతే అటు డార్లింగ్​ ఫ్యాన్స్ ఇటు రాకీభాయ్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటారు మరి.​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.